జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఇటీవల చోటుచేసుకున్న 8ఏళ్ల బాలిక అసిఫా బానోపై అత్యాచారం, హత్యఫై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. తాజాగా ఈ ఘటనపై కథువా ఘటన గురించి తెలిసి తాను ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యానని మనేకా అన్నారు. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించాలన్నారు. ఇందుకోసం చట్టంలో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని సోమవారం కేంద్ర మంత్రివర్గ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ‘కథువాతో పాటు ఇటీవల చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి తెలిసి ఎంతో కలత చెందాను. 12ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించేలా పోస్కో చట్టంలో సవరణలు తీసుకురావాలని కోరుకుంటున్నాం’ అని మేనక అన్నారు. ఘటనతో యావత్ భారతం దిగ్భ్రాంతికి గురైంది. బాధిత చిన్నారికి న్యాయం చేయాలంటూ ఇప్పటికే పలుచోట్ల ర్యాలీలు, ఆందోళనలు చేపట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా గురువారం అర్ధరాత్రి శాంతియుత కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.