మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ ‘శక్తి’ క్షేత్రాలలో విశిష్టమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న ధామం ‘మంగళూరు’.
సాక్షాత్తు మంగళాదేవి ఈ క్షేత్రంలో కొలువై ఉండటంవల్ల ఈ క్షేత్రానికి మంగళూరు అనే పేరొచ్చింది.
కర్ణాటక రాష్ట్రంలోని ప్రాచీన హైందవ దేవాలయాలలో మంగళూరు ఒకటి.
ఇక్కడున్న ‘బలారా’అనే ప్రాంతంలో నిర్మితమైన ఈ దేవాలయం మహిమాన్విత శక్త్ధిమంగా విరాజిల్లుతోంది.
మంగళూరును పూర్వం ‘మంగళాపురం’ అని పిలిచేవారు. కాలక్రమంలో అదే మంగళూరుగా మారింది.
కర్ణాటక రాష్ట్రంలో ఉన్న అతి పురాతన ఆలయాలలో ఇదొకటి. 9వ శతాబ్దంలో కర్ణాటకలోని తుళునాడు ప్రాంతాన్ని పరిపాలించిన ‘ఆహేపా’వంశానికి చెందిన కుందవర్మ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది.
ఎందరో సిద్ధపురుషులు నడయాడిన పుణ్య ప్రదేశమిది. పూర్వకాలంలో మశే్చంద్రనాధుడు, గోరఖ్‌నాధుడనే సిద్ధపురుషులు ఈ మంగళాపురానికి వచ్చి, ఇక్కడకు సమీపంలోని నేత్రావతి ఒడ్డున తపస్సుచేశారని ప్రతీతి.
మన పురాణాలలో ఉత్తమ రుషుల కోవకి చెందిన కపిల మహర్షి ఈ ప్రాంతంలోనే తపస్సు చేశాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది.
ఈ క్షేత్రంలో కొలువుదీరిన మంగళాదేవి దర్శనం సర్వపాప హరణం. సకల పుణ్యప్రదం. అమ్మవారిని దర్శించినవారికి వివాహ సంబంధమైన గ్రహదోషాలు నశించి శుభాలు కలుగుతాయంటారు.
ఈ దేవి దర్శనం సర్వమంగళాలు సిద్ధిస్తాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.