YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మళ్లీ యాక్టివ్ కానున్న కొండా దంపతులు

మళ్లీ యాక్టివ్ కానున్న కొండా దంపతులు

వరంగల్, జూలై 22, 
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఒకప్పుడు కొండా మురళి, సురేఖ దంపతులు రాజకీయాలను శాసించారు. పరకాల నియోజకవర్గాన్ని తమ అడ్డాగా చేసుకుని మరీ పాలిటిక్స్ లో వేడి పుట్టించారు. అక్కడి నుంచే రాజకీయంగా ఎదిగి కొండా సురేఖ మంత్రి కూడా అయ్యారు. అయితే పరకాల అచ్చిరాలేదని వారికి తెలిసొచ్చింది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాన్ని మార్చేయాలని కొండా దంపతులు డిసైడ్ అయ్యారట.పరకాల నియోజకవర్గంలో కొండా దంపతులు మూడు పర్యాయాలు విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇద్దరూ ఒక వెలుగు వెలిగారు. వరంగల్ ఫైర్ బ్రాండ్ గా పేరుంది. అయితే వైఎస్ మరణం తర్వాత క్రమంగా రాజకీయంగా కూడా వీరి ప్రాబల్యం తగ్గిపోయింది. తొలుత వైసీపీలో చేరిన కొండా దంపతులు తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ వరంగల్ తూర్పు టిక్కెట్ ఇవ్వడంతో అప్పుడు సురేఖ గెలిచారు. అయితే 2018 ఎన్నికల్లో తొలి జాబితాలో టిక్కెట్ దక్కకపోవడంతో కొండా దంపతులు పార్టీ అధిష్టానంపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు.2018 ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసిన కొండా సురేఖ ఓటమి పాలయ్యారు. దాదాపు ఏడాదిన్నరకాలం నుంచి ఇద్దరూ సైలెంట్ గానే ఉన్నారు. అయితే గత కొద్దిరోజుల నుంచి వారిద్దరూ యాక్టివ్ గా కనపడుతున్నారు. ఇంతకాలం తమను నమ్మకున్న అనుచరుల ఇళ్లకు వెళుతున్నారు. వారితో మాటా మంతీ కలుపుతున్నారు. అలాగే ఎన్నికల సమయంలో తమకోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తల ఇళ్లకు వెళ్లి మరీ వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు.అయితే పరకాల నియోజకవర్గాన్ని కొండా దంపతులు పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచే మళ్లీ బరిలోకి దిగాలని కొండా సురేఖ డిసైడ్ అయ్యారు. కొండా మురళి ఈసారి భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. వరంగల్ పట్టణంలోనూ పట్టు పెంచుకునే ప్రయత్నంలో కొండా దంపతులు ఉన్నారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని భావిస్తున్నారు. మొత్తం మీద రీఛార్జి అయి కొండా దంపతులు యాక్టివ్ కావడం పార్టీకి ఆ జిల్లాలో శుభపరిణామమే.

Related Posts