YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆరోగ్యం తెలంగాణ

డ్రై ఫ్రూట్స్ తెగతినేస్తున్నారు...

 డ్రై ఫ్రూట్స్ తెగతినేస్తున్నారు...

హైద్రాబాద్, జూలై 22, 
ష్ట్రంలో కరోనా నానాటికి కోరలు చాస్తోంది. కరోనా దరి చేరకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తి పెంపుదలే ఏకైక మార్గమని చెబుతున్నారు. ఈక్రమంలో విట మిన్ డి3, జింకోవిట్, బీకాంప్లెక్స్, విటమిన్ సి, పారాసెటిమా ల్, అజిత్రో మైసిన్ టాబ్లెట్స్‌కు గిరాకీ పెరిగింది. ముందు జాగ్రత్తగా వాటిని మందుల షాపుల నుంచి కొనుగోలు చేసి భద్రపరుస్తున్నారు. కోవిడ్ బాధితులు ఆహారం తినలేరు కాబట్టి వారికి విటమిన్ టాబ్లెట్స్ తప్పసరిగా అందించాల్సి ఉంటుంది. మిగిలిన వారంతా ఆయా ట్లాబ్లెట్స్ జోలికి వెళ్లకుండా పండ్లు, ఆకుకూరలను భుజించడం ఎంతైనా శ్రేయస్కరం. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ కరోనా అదును చూసి పంజా విసురుతోంది. ఈ పరిస్థితు ల్లో తమ తమ ఇళ్లల్లో వున్న వృద్ధులు, పిల్లలసంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. తాము కూడా కరోనా కాటు కు గురికాకుండా అనువైన చర్యలను చేపడుతున్నారు. ఇమ్యూనిటి పెంపులో కీలకమైన డ్రైఫ్రూట్స్‌ని విరివిగా వినియోగిస్తున్నారు. గతం కంటే 50 శాతం మేర డ్రైఫ్రూట్స్ అమ్మకాలు పెరిగాయని ఆయా దుకాణదారులు చెబుతున్నారు. శొంఠి, యాలకులు, లవంగాలకు సైతం డిమాండ్ పెరిగింది. కరోనాకు ముందు నెలకు రెండు కిలోల శొంఠి విక్రయించేవాళ్లు ప్రస్తుతం పది కిలోల వరకు విక్రయిస్తున్నారు.మరోవైపు ఇంతవరకు వేడి నీరంటే ముట్టని వారు సైతం రోజు ఉదయాన్నే కాచిన నీరు తాగుతున్నారు. వాటిలో పసుపు, నిమ్మరసం వంటి వాటిని చేర్చి మరింతగా శరీరానికి అందిస్తున్నారు. ఆవిరి పట్టుకోవడమనేది నిత్యకృత్యంగా మారింది. ఇలా పలు విధాలుగా, పలు రకాలుగా కరోనా విలయాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఇతరత్రా చిట్కాలను సైతం ఉపయోగిస్తున్నా రు. ప్రధానంగా తమ తమ ఇళ్లల్లో శుచి, శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. పూర్వకాలంంలో ఇంట్లోకి రావాలంటే కాళ్లు కడుక్కొని మరీ రావాల్సి ఉండేది. ఆనాడు షేక్ హ్యాండ్‌ల సంస్కృతే లేదు. నమస్కారం, ప్రతి నమస్కారం మన సంస్కృతిగా కొనసాగేది. క్రమేపి ఆ సంస్కృతులు కనుమరుగయ్యాయి. ఈనాడు ఆ పరిస్థితి మచ్చుకైనా కనబడటం లేదు. తత్పలితమే నేడు ఒక చిన్న క్రిమి తన ప్రతాపాన్ని బలంగా చాటడానికి కారణమవుతోంది. దీంతో ప్రస్తు తం కరోనా భయానికి ప్రజలంతా భౌతిక దూరంతో పాటు స్వీయ నియంత్రణకు ప్రాధాన్యతనిస్తున్నారు. అందులో భాగంగానే మీరు మా ఇంటికి రావొద్దు.. మేము మీ ఇంటికి రాము అని కుండబద్దలు గొడుతున్నారు. కరోనా అంతగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

Related Posts