దర్శి జూలై 22,
ప్రకాశం జిల్లా దర్శి లో బుధవారం స్థానిక బీజేపీ కార్యాలయం లో భారతీయ జనతాపార్టీ, జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా బీజేపీ కార్యదర్శి యేరువ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి రాష్ట్రం నష్ట పోయింది అని 12లక్ష ల ఇల్లు ఆనాటి ఈనాటి ఎన్డిఎ కేంద్ర ప్రభుత్వం కేటాయించిగా గత రాష్ట్ర ప్రభుత్వం దానిలో అవినీతి కి పాల్పడి వెయ్యి రూపాయలు చదరపు అడుగు అయ్యే నిర్మాణానికి చదరపు అడుగు రెండు వేల ఐదు వందలు గా నిర్ణయించి దాదాపు 3 లక్ష లు ఇల్లు నిర్మిం చబడ్డాయి అని కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం లో కి వచ్చి దీనిలో అవినీతి జరిగిందని కేటాయించిన లబ్ధి దారులు తెలుగు దేశం వారని ఆరోపణలు చేయడం 90 శాతం పూర్తి అయిన ఇళ్లను ఎవరికీ ఇవ్వలేదని తెలిపారు. అందువలన భారతీయ జనతా పార్టీ కోరేది ఒక్కటే , అవినీతి జరిగిందని రుజువు చేసి దోషులను శిక్షించాలి అని సామాన్య లబ్ది దారులను ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు . లబ్ధిదారులు కేటాయించిన ఇండ్లను వెంటనే వారికి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ మరియు జనసేన డిమాండ్ చేస్తుంది అని తెలిపారు. పేద ప్రజల ఇండ్ల నిర్మాణంలో అత్యంత అవినీతి కి పాల్పడ్డ తెలుగుదేశం పార్టీ, పేద ప్రజలకు ఇండ్ల స్థలాల కేటాయింపులో వేల ఎకరాల అత్యధిక సొమ్ముతో కొని, వాళ్ళ ఎమ్మెల్యేలు భూ కుంభకోణానికి పాల్పడ్డ వైఎస్ఆర్సిపి పార్టీల వైఖరికి నిరసనగా బుధవారం ఉదయం10 గంటల నుండి 12 గంటల వరకు దర్శి అద్దంకి రోడ్ లో గల పార్టీ ఆఫీసులో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బాయి రెడ్డి వెంకట ప్రదీప్, ఆర్ సత్యనారాయణ, వెంకట్ నారాయణ బిజెపి నాయకులు ఆరికట్ల వెంకట్ నారాయణరెడ్డి, బాదం రమణారెడ్డి, పుప్పాల కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.