YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గవర్నర్ కట్ ఔట్ కు వినతి పత్రం

గవర్నర్  కట్ ఔట్ కు వినతి పత్రం

అమరావతి జూలై 22 
ప్రజాభీష్టానికి భిన్నంగా పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించవద్దని కోరుతూ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్  కటౌట్ కు అమరావతి యువజన జెఎసి ఆధ్వర్యంలో  వినతి పత్రం సమర్పించి  రాష్ట్ర నడిబొడ్డున ఏకైక రాజధానిగా అందరికీ అందుబాటులో అమరావతినే కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి రాష్ట్ర యువజన అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ నేతృత్వంలో  విద్యార్థులు  యువత కోరారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్  పరిరక్షణ సమితి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ పరిపాలన వికేంద్రీకరణ పేరిట పంపిన మూడు రాజధానులు బిల్లు మరియు సీఆర్డీఏ రద్దు బిల్లును ఆమోదించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ గారికి ఫైల్ పంపడం బాధాకరమని దీన్ని వెంటనే రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ గారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్  201 ప్రకారం విచక్షణ అధికారాలు ఉపయోగించి బిల్లును  తొందరపడి ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షకు భిన్నంగా 3 రాజధానుల పేరుతో అభివృద్ధి నిరోధక కుట్రపూరిత రాజకీయం చేస్తోందని గత ఏడు నెలలుగా అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని జరుగుతున్న శాంతియుత సకల జనుల పోరాటానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్న విషయాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా  విస్మరిస్తోందని అమరావతి ప్రాంతంలో ఇప్పటికే నాలుగు సంవత్సరాలుగా పూర్తిస్థాయి రాజధానిగా సచివాలయం శాసనసభ మండలి హైకోర్టు వివిధ శాఖల కేంద్ర కార్యాలయాలు  పనిచేస్తున్నాయన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఇప్పటిదాకా దాదాపు 10 వేల కోట్ల గత ప్రభుత్వం వ్యయం చేసి పలు బహుళ అంతస్తుల భవనాలు ఉన్న దాదాపు పూర్తి చేసిన ప్రస్తుత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విలువైన ప్రజాధనాన్ని పాడు చేస్తుందని
అమరావతి రాజధాని నిర్ణయం అనేది  గతంలో అసెంబ్లీ సాక్షిగా అప్పటి అధికార ప్రతిపక్ష పార్టీల సంపూర్ణ  మద్దతుతోనే జరిగిందని అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని ఉండాలి కనీసం 30 వేల ఎకరాలు  ఉండాలని  అన్నారు కానీ ప్రభుత్వాలు  మారిన తర్వాత  వ్యక్తుల మీద కక్షతోమాటలు మార్చటం సబబు కాదని తెలిపారు.
కావున ఇటువంటి వినాశకపూరిత బిల్లులను విచక్షణ అధికారాలు ఉపయోగించి రాజ్యాంగ విలువలను ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను రక్షించే విధంగా రాష్ట్రపతి గారి పరిశీలనకు పంపాలని కోరారు.  

Related Posts