YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

హమాలీ కూలి రేట్లు పెంచండి

హమాలీ కూలి రేట్లు పెంచండి

నంద్యాల జులై 22   
నంద్యాల మార్కెట్ యార్డు యందు బుధవారం నాడు అర్దనగ్నంగా భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు. సివిల్ సప్లయిస్‌‌ హమాలీలకు 2020జనవరి 1నుండి కూలిరేట్లు పెంచి చెల్లించాల్సివుండగా నేటికీ రేట్లు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడాన్ని ఎ.పి.పౌరసరఫరాల సంఘం హమాలీల రాష్ట్ర యూనియన్స్ (సీఐటీయూ )తప్పుబట్టారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కూలిరేట్లు పెంచి ఎరియర్స్ తో సహా చెల్లించాలని డిమాండ్ చేస్తు 3 వరోజు సివిల్ సప్లై గోడౌన్ దగ్గర అర్ధనగ్నంగా  భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలియజేయజేసారు . ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు లక్ష్మణ్, సివిల్ సప్లై హమాలి వర్కర్స్  యూనియన్ కార్యదర్శి గోపాల్ ల తో పాటు మరో 40 మంది హమాలీలు పాల్గొన్నారు .
   అనంతరం సిఐటియు అధ్యక్షులు లక్ష్మణ్, సివిల్ సప్లై హమాలి యూనియన్ కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ కరోనాప్రాణాంతక మహమ్మారి కాలంలో సహితం ప్రజాపంపిణీ సరుకులను రెడ్ జోన్స్ లలో సహితం ఎగుమతి-దిగుమతి పనులు నిర్వహిస్తున్నారు . అయినా  కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు  హమాలీలకు 50లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు ,గత 23ఏళ్లుగా ఈ.ఎస్.ఐ.పధకాన్ని హమాలీలకు అమలు చేయకుండా ప్రభుత్వాలే కోర్టులలో వ్యాజ్యాలు వేసి హమాలీలకు తీరని ద్రోహం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ,ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కోర్టులలోని కేసులను ఉపసంహరించి హమాలీలకు ఈ.ఎస్.ఐ.పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి చుక్కలంటుతున్నాయని పెరిగిన ధరలకు అనుగుణంగా కూలిరేట్లు పెంపు పైన గత ఫిబ్రవరిలో ఎం.డి.సమక్షంలో హమాలీ సంఘాలతో చర్చలు జరిగాయని తెలిపారు ,అయినా రాష్ట్ర ప్రభుత్వం కూలిరేట్లు పెంపు విషయంలో తగిన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల హమాలీ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు , ప్రభుత్వం సకాలంలో స్పందించి కూలిరేట్లు పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అవసరమైతే అన్ని రకాల సరుకుల ఎగుమతి, దిగుమతుల ను ఆపి జులై నెలాఖరు లో సమ్మెకు కూడా సిద్దం అవుతామని హెచ్చరించారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన విధంగా న్యాయం చేయాలని కోరారు .

Related Posts