YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సాహిత్యం తెలంగాణ

ప్రజలలో చైతన్యాన్ని రగిలించిన కలం యోధుడు దాశరథి..... మంత్రి శ్రీనివాస్ గౌడ్

ప్రజలలో చైతన్యాన్ని రగిలించిన కలం యోధుడు దాశరథి..... మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరబాద్ జూలై 22 
మహాకవి దాశరథి 96 వ జయంతి ని రవీంద్రభారతిలో ని రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మహాకవి దాశరథి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాకవి అని కీర్తించారు. జైల్లో నిర్బంధించిన జైలు గోడల మీద కవిత్వాన్ని రాసి ప్రజలలో చైతన్యాన్ని రగిలించిన కలం యోధుడు అన్ని పేర్కొన్నారు మంత్రి. శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాతనే తెలంగాణ కవులకు గౌరవం లభిస్తోందన్నారు. వారి జయంతులను అధికారికంగా భాషా సాంస్కృతిక శాఖ ద్వారా నిర్వహిస్తున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసిఅర్ కవుల పక్షపాతిగా మంత్రి అభివర్ణించారు మహాకవి దాశరథి జయంతి ని అధికారికంగా నిర్వహించటానికి ఆదేశాలు ఇవ్వడమే కాక, ప్రతి సంవత్సరం ప్రముఖ కవులకు సత్కారం, పురస్కారాలను అందిస్తున్నారన్నారు. 2020 సంవత్సరపు దాశరథి పురస్కారాన్ని డా. తిరునగరి రామనుజయ్య ను ఎంపిక చేశామన్నారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని దాశరథి అన్న మాట ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రజలందరినీ ఉర్రూతలూగించిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు దాశరథి మాటలనే స్ఫూర్తి గా తీసుకొని ఇప్పుడు తెలంగాణ ను కోటి ఎకరాల మాగాణం చేసే మహాయజ్ఞం చేస్తున్నారు. ఇప్పటికే 70 లక్షల ఎకరాలకు సాగునీరు ను అందించే సదుపాయం చేశారన్నారు ఈ సందర్భంగా దాశరథి కుటుంబ సభ్యులను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి   శ్రీనివాస రాజు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, మహాకవి దాశరథి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts