YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

పిడిఎస్ రైస్ అక్రమ రవాణాపై ఉక్కు పాదం - రూ.15.39 లక్షల 570 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టివేత - ఐదుగురు నిందితులు అరెస్ట్

పిడిఎస్ రైస్ అక్రమ రవాణాపై ఉక్కు పాదం  - రూ.15.39 లక్షల 570 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టివేత  - ఐదుగురు నిందితులు అరెస్ట్

పెద్దపల్లి,  జూలై 22  
రామగుండము పోలీస్ కమిషరేట్ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు రూ.15,39,000 ల విలువైన 570 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ ను టాస్క్ ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు. బుధవారం పోలీస్ కమిషరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిపి అడ్మిన్ ఎన్.అశోక్ కుమార్ వివరాలు వెల్లడించారు. రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు ఈ నెల 19న టాస్క్ ఫోర్సు సిఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్సు బృందం, స్థానిక పోలీసులు బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవ పూర్  గ్రామ శివారులో పిడిఎస్ రైస్ మంథని మండలం వివిధ ప్రాంతాల నుండి సేకరించి బుధవారం లారీలో లోడ్ చేసి గుజరాత్ కు అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమచారంతో దాడి నిర్వహించి పిడిఎస్ రైస్ లోడ్ చేసిన లారీని స్వాధీన పరుచుకొని ముగ్గురిని  అదుపులోకి తీసుకున్నారు. అలాగే పోత్కపల్లి గ్రామ శివారులో పిడిఎస్ రైస్ పోత్కపల్లి మండలం వివిధ ప్రాంతాల నుండి సేకరించి డిసిఎం వ్యాన్ లో పిడిఎస్ రైస్ బస్తాలు లోడ్ చేసి వాటిని గుర్తించకుండా బయటవైపు వడ్ల బస్తాలను లోడ్ చేసి మహారాష్ట్ర కు అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమచారంతో దాడి నిర్వహించి పిడిఎస్ రైస్ లోడ్ చేసిన డిసిఎం వ్యాన్ ను స్వాధీన పరుచుకొని ఒక్కరిని అదుపులోకి తీసుకోవడం  జరిగింది. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నేల్కి వెంకటాపూర్ గ్రామంలో  పిడిఎస్ రైస్ దండేపల్లి మండలం వివిధ ప్రాంతాల నుండి సేకరించి కట్ల శ్రావణ్ అనే వ్యక్తి తన ఇంట్లో నిల్వ చేసి ఉంచడనే సమచారం మేరకి ఇంట్లో తనిఖీ చేయగా అక్రమంగా నిల్వ చేసిన 150 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ గుర్తించడం జరిగింది. అతనిని విచారించగా ఇట్టి పిడిఎస్ రైస్ ని మహారాష్ట్ర కు అక్రమ రవాణా చేయడానికి వివిధ గ్రామాల నుండి సేకరించి నిల్వ చేయడం జరిగిందని తెలపడం జరిగింది. జమ్మికుంట కు చెందిన బొల్లా అనిల్, ద్వారకా గుజరాత్ కు చెందిన సుమనియా రాజమల్బ సోమ్భ, మంథనికి చెందిన బోగే సర్వేశ్, ఓదెల మండలం ఉప్పెరిపల్లికి చెందిన కొమిరె రాజ్ కుమార్, దండేపల్లికి చెందిన కట్ల శ్రావణ్ లను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.

Related Posts