హైదరాబాద్ జూలై 22
అగ్నిమాపక శాఖ నిబందనల్లో మార్పు చోటుచేసుకున్న నేపద్యం లో రాష్ట్రంలో మొత్తం 1,456 ప్రైవేటు రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలలు అయోమయంలో పడ్డాయి.. అగ్నిమాపక శాఖ నుంచి ‘ఎన్‌ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) అందుకుంటే తప్ప... ఈ కళాశాలలకు... ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి అనుమతి లభించబోదు. అగ్నిమాపక శాఖ నిబందనల్లో మార్పు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 1,456 ప్రైవేటు జూనియర్ కళాశాలలున్నాయి. వీటిలో కేవలం 130 కళాశాలలు మాత్రమే అగ్నిమాపక శాఖ నిబంధనల ప్రకారమున్నాయి. ఈ క్రమంలో... మిగిలిన కళాశాలలకు... అంటే 1,326 కళాశాలలకు గుర్తింపు లభించే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. దీంతో... పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని ఆయా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు యోచిస్తున్నాయి.