విజయవాడ, జూలై 23,
చాలినంత నిధులు లేక రాష్ట్రం ఒకవైపు సతమతమౌతుండగా మరోవైపు రుణపరిమితి కూడా కుదించుకుపోవడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. తాజా లెక్కల ప్రకారం 9వేల కోట్ల రూపాయలు మాత్రమే మార్కెట్ బారోయింగ్స్ ద్వారా సేకరించుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది. ప్రభుత్వ అవసరాలకు ఇది ఏమాత్రం చాలదు. మరోవైపు ఆ మొత్తాన్ని దాటితే ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనల ప్రకారం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆర్థికశాఖ పడిపోయింది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి రూ.30,305 కోట్ల వరకు రుణాన్ని తీసుకునేరదుకు కేంద్రం అనుమతి ఇచ్చిరది. దీనిని ప్రతి తైమాసికంలో కొరతమొత్తం చొప్పున తీసుకోవాల్సి ఉరటురది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి, అన్ని రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి క్షీణిరచిపోయిన నేపథ్యంలో రాష్ట్రాలకు రుణాలు తీసుకునేరదుకు కొరత వెసులుబాటు కల్పిరచారు. ఇరదులో భాగంగానే తొలి తొమ్మిది నెలలకు తీసుకోవాల్సిన మొత్తాన్ని ఖరారు చేసి, ఆ మొత్తాన్ని అవసరాన్ని బట్టి మురదే తీసుకునేరదుకు వెసులుబాటు కల్పిరచారు. దీని ప్రకారం తొలి తొమ్మిది నెలలకు 24,252 కోట్లు తీసుకునే అవకాశం వచ్చిరది. వాస్తవ మొత్తానికి అదనంగా 5,051 కోట్లు కొవిద్ ఖాతాలో తీసుకోవచ్చని రిజర్వ్‌బ్యారకు పేర్కొరది. దీరతో మొత్తం అరదుబాటులో ఉరడే రుణర రు29,303 కోట్లు కాగా, అరదులో 23 వేలకోట్ల రూపాయలు ఇప్పటికే తీసుకున్నట్లు తేలిరది. దీరతో ఇరకా తీసుకునేరదుకు కేవలం ఆరువేల కోట్ల వరకు మాత్రమే అవకాశమున్నట్లు తెలుస్తోరది. అయితే అధికారులు మాత్రం జూలై ఆరంభం నాటికి కొవిద్ వెసులుబాటు రుణం 5,051 కోట్లతో కనిపి 12 వేల కోట్లు తీసుకోవచ్చని అంటున్నారు. ఇరదులో జూలైలో మూడు వేల కోట్లు తీసుకోగా ఇక 9 వేల కోట్లు తీసుకునేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే మరో నాలుగైదు వేల కోట్లు అవసరమౌతాయని తెలిపారు.