YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

శానిటైజర్లతో జరాభద్రం

శానిటైజర్లతో జరాభద్రం

హైద్రాబాద్, జూలై 23, 
కరోనా నేపథ్యంలో యావత్ ప్రపంచానికి అత్యవసరమైన వస్తువుల్లో ప్రధమ స్థానం శానిటైజర్లకే లభిస్తోందని చెప్పాలి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మనుషులు శానిటైజర్లను తెగ వాడేస్తున్నారు. ఇంట్లో ఉన్నా, గడప దాటినా, ఎక్కడికి వెళ్లినా సరే శానిటైజర్‌ చేతులకు రాసుకోవడం, సబ్బు నీళ్లతో కడగడం ఇప్పుడు షరా మామూలుగా మారిపోయింది. తల్లిదండ్రులు పిల్లల చేతులను సైతం శానిటైజర్లతో శుభ్రపరుస్తున్నారు. ఇక గృహిణుల విషయానికి వస్తే వంట చేసే సమయంలో కూడా శానిటైజర్లను రాసుకోవడం మానడం లేదు. అయితే.. శానిటైజర్‌తో ఎంత ప్రయోజనం ఉందో అంతే నష్టం కూడా ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా గృహిణులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే శానిటైజర్లలో 90 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. ఈ మిశ్రమానికి తక్కువ వేడిలో కూడా మండే స్వభావం ఉంటుంది. కాబట్టి శానిటైజర్ని చేతికి రాసుకున్న వెంటనే వంట గదిలోకి వెళ్లి గ్యాస్‌ స్టవ్‌ వెలిగిస్తే నిప్పు అంటుకునే ప్రమాదం పొంచి ఉంది. అందుకే పిల్లలు, గృహిణులు దీన్ని వాడిన వెంటనే నిప్పు జోలికి వెలితే, చేతులు మండుకుని కాలిపోయే ప్రమాదం ఉందని, అతిగా శానిటైజర్లను వాడటం కంటే సబ్బునీళ్లతో చేతులు శుభ్రపర్చుకోవడమే ఉత్తమమని  వైద్యులు హెచ్చరిస్తున్నారు. శానిటైజర్లను వాడటంలో ప్రయోజనాలతోపాటు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి కాబట్టి పిల్లల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.చేతులు శుభ్రం చేసుకోకుండా కొన్నిసార్లు ఆహార పదార్థాలు తింటూ ఉంటాం. ఇది మంచిది కాదు. ఎందుకంటే, ప్రతిరోజు మన చేతిలో ఒక మిలియన్‌ క్రిములు నిండిపోతాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎప్పుడూ సబ్బు నీటితో చేతులు కడుక్కోవడం సాధ్యం కాదు. కాబట్టి చాలామంది శానిటైజర్లను వాడుతుంటారు. ఇందులో మద్యం ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్ల వినియోగం ఎక్కువగా ఉంది. ఈ హ్యాండ్‌ శానిటైజర్లని వాడిన తర్వాత నీరు అవసరం లేదు. సాధారణ సబ్బు, నీరు లేకుండానే.. చేతులని శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చేతుల్లోని క్రిములు చాలా వరకు నశిస్తాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో వీటి వాడకం మరింత ఎక్కువైంది.  సాధారణంగా శానిటైజర్లలో 60–90శాతం ఆల్కహాలు కలిసి ఉంటాయి. అదే క్రిముల్ని సంహరిస్తుంది. రానీ  ఈ మిశ్రమానికి వంద డిగ్రీల కంటే తక్కువ వేడిలో కూడా మండే స్వభావం ఉంటుంది. ఇది చేతికి రాసుకున్న వెంటనే వంట గదిలోకి వెళ్లి గ్యాస్‌ స్టవ్‌ వెలిగిస్తే నిప్పు అంటుకునే ప్రమాదం పొంచి ఉంది. అందువల్ల గృహిణులు చేతికి శానిటైజర్‌ రాసుకుని అది ఆరిన తర్వాతే వంట చేసే పనులు చేయడం మేలు. అలాగే పదేళ్ల లోపు పిల్లలు వినియోగించే  సమయంలో తగిన జా గ్రత్తలు తీసుకోవాలి. ఐదేళ్ల లోపు వారికి చర్మ సంబంధిత సమస్యలు వస్తున్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు. శానిటైజర్ల వినియోగం ద్వారా సమస్యలు వస్తాయని అంతర్జాతీయ పరిశోధన సంస్థ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రి వెన్షన్‌ సెంటర్‌ నివేదికలు సూచిస్తున్నాయి. చేతుల్లో వేసుకుని రుద్దుకున్న తర్వాత ఒక నిమిషంలో అది ఆవిరవ్వాలి. అలా కాకుండా చేతులకు అంటుకుని ఉంటే చర్మ సంబంధమైన సమస్యలు వస్తాయి. జిగురు, నురుగు మాదిరి కంటే ద్రావణంగా ఉండే శానిటైజర్లే మంచిది.శానిటైజర్లతో 60–90 శాతం ఆల్కహాల్‌ ఉండాలి. అంతకంటే తగ్గినా, ఎక్కువగా ఉన్నా ఆశించిన ఫలితం రాకపోగా కొత్త సమస్యలు వస్తాయి. కనీసం 20–30 సెకన్ల పాటు చేతులకు రుద్దుకోవాలి.శానిటైజర్ల వాడకంపై విస్తృతంగా ప్రచారం జరగడంతో పలు నాసిరకం శానిటైజర్లు మార్కెట్లోకి వచ్చాయి. వాటి గాఢత ఎక్కువ ఉండటంతో ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది. శానిటైజర్ల ధరలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. సబ్బు అయితే తక్కువ ధరలో లభ్యమవుతుంది. చేతులు పూర్తిస్థాయిలో శుభ్రమవుతాయి. వైద్యులు సైతం సబ్బుతో చేతులు శుభ్రం చేసుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు.

Related Posts