YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

కరోనాతో ఆయుర్వేద ఉత్పత్తులకు డిమాండ్

కరోనాతో ఆయుర్వేద ఉత్పత్తులకు డిమాండ్

హైద్రాబాద్, జూలై 23, 
కరోనా పుణ్యమాని ఆయుర్వేద ఉత్పత్తులు, మనం వంటింట్లో వాడే వివిధ రకాల సుగంధ ద్రవ్యాలకు మంచి గిరాకీ ఏర్పడింది. కరోనా నుంచి రక్షణకు అల్లం, పసుపు, వెల్లుల్లిని విరివిగా వాడుతున్నారు. పసుపు మన భారతీయ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత పొందింది. శుభసూచికకు చిహ్నంగా పసుపును భావిస్తారు. హిందీలో హల్ది అనీ, తెలుగులో పసుపు, తమిళం మరియు మలయాళంలో మజ్జల్ ,కన్నడలో ఎరిసినా అని పిలుస్తారు. శాస్త్రీయంగా పసుపుని కుర్కుమా లాండా అని పిలుస్తారు,పసుపు పొడిని దక్షిణాసియా వంటలలో ఉపయోగిస్తారు. పసుపు మొక్కల ఆకులు కూడా ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. పసుపులో ఎక్కువ ప్రయోజనాలు ఉండటానికి కారణం వాటిలో జరిగే  ఫైటో కెమిస్ట్రీయే అంటారు డాక్టర్లు. పసుపులో ఉండే కాంపౌండ్స్ వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పసుపురంగులో కూడా టర్మెరోన్, అట్లాంటాన్ మరియు జిన్గిబ్రేన్ అనే అస్థిర నూనెలు ఉంటాయి. పసుపులో విటమిన్లు, లవణాలతో పాటు శరీరారోగ్యానికి తోడ్పడే ఫైటిన్‌ఫాస్ఫరస్‌ గూడా అధికంగానే ఉంటుంది.పసుపు మనం తీసుకునే ఆహరంని జీర్ణం చేసి శరీర యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది గ్యాస్ మరియు ఉబ్బరం తగ్గించే శక్తి కలిగి వుంటుంది. సార్బ్ సోరియాసిస్, మొటిమలు మరియు తామర వంటి ఇతర చర్మ వ్యాధులపై సమర్ధంగా పనిచేస్తుంది. పసుపు వాపు మరియు గుండె వ్యాధి మరియు గుండె జబ్బులనుంచి రక్షణ కల్పిస్తుంది. దీర్ఘకాలిక కంటి సమస్యలను నివారిస్తుంది.పసుపు టీ వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రోగనిరోధకత పెరుగుతుంది.పసుపులో అద్భుతమైన యాంటీఆక్సిడెంట్ గుణాలు వున్నాయి. పసుపు బరువు తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన కళ్ళకు పసుపు దోహదపడుతుంది. గుండె జబ్బులను నిరోధిస్తుంది. కరోనా కారణంగా రోగనిరోధకశక్తి తగ్గకుండా చేస్తుంది. అల్జీమర్స్ వ్యాధి నిరోధిస్తుంది. క్యాన్సర్ కారకాలను, మధుమేహంను నివారిస్తుంది. మహిళలు తమ అందాన్ని పెంచుకునేందుకు పసుపు ఎక్కువగా వాడతారు. మొటిమల నివారణకు, కళ్లనలుపు తగ్గేలా చేస్తుంది. మనిషి శరీరంలో వ్యాపించిన కరోనా వైరస్ ను అంతం చేయడానికి శరీరంలోని యాంటీబాడీలు కీలకంగా పని చేస్తున్నాయి. శరీరంలో వైరస్‌కి ధీటైన యాంటీబాడీలు తయారవుతున్నాయి. అయితే మనిషిని కాపాడడానికి ఎంతగానో పనిచేస్తున్న యాంటీబాడీల కొన్ని నెలల్లోనే తగ్గిపోతున్నట్లు లండన్‌లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఈ కరోనా వైరస్ సాధారణ జలుబులాగానే మళ్లీ మళ్లీ సోకే అవకాశం ఉంది.కరోనా వైరస్ వ్యాప్తి చెందిన వారిలో 65 మందిపై చేసిన ప్రయోగాల్లో అనేక విషయాలు బయటపడ్డట్లు తెలుస్తోంది. ఇకపోతే కరోనా వైరస్ ని ఎదుర్కునేందుకు మనిషికి వ్యాధి నిరోధక శక్తి చాలా కీలకం. పసుపును ఎక్కువగా వాడితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Related Posts