YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

"స్వరాజ్యం నా జన్మహక్కు-దాన్ని సాధించి తీరతాను"

"స్వరాజ్యం నా జన్మహక్కు-దాన్ని సాధించి తీరతాను"

ఒక భారతీయ సింహంది గర్జన...
తెల్లోళ్ల పాలనలో,తెల్లోలచే  "The Uncrowned Prince Of an India(మకుటం లేని మహారాజు)" అనిపించుకున్న స్వతంత్ర్యపోరాట కెరట భిషక్ "బాలగంగాధర్ తిలక్".నానాటికి కుంచించుకుపోతున్న స్వరాజ్యభావనను తన పదునైనా, ఘాటైన వ్యాఖ్యలతో నిద్దరపోతున్న భారతీయులని నిద్దుర లేపి తెల్లోళ్ళకి చుక్కలు చూపించిన వీరుడాయన.స్వరాజ్య పోరాటానికి నూతనోత్తేజాన్ని పంచిన భగభగ మండే భానుడయాన...ప్లేగుతో కుమారుడు మరణించిన ఆ బాధను గుండెల్లో దాచుకొని ప్లేగు రోగులకు సేవలందించిన పరమ దయాళువు. పన్నులు కట్టమని ఆజ్ఞలు జారిచేస్తే పంచెలు తడిపించిన వీరుడాయన.అందుకే తెల్లోళ్ళు "The Father Of Indian Unrest(అశాంతి పితామహుడు)"అని నిష్టురంగా ఆడిపోసుకున్నా ఆయనలోని దేశభక్తిని మాత్రం ఆర్పలేకపోయారు.ఆయన మరణించేoత వరకు స్వరాజ్య భావనను ప్రతి ఒక్క భారతీయులలో నాటుతూ,మనలోని ఐక్యత,మన బలాన్ని  తెల్లోళ్ళకి చూపించడానికి గణేష్ ఉత్సవాలు,మాత దుర్గ,శివాజీ ఉత్సవాలు ఆరంభించిన స్వాప్నికుడాయన...1920 వరకు స్వాతంత్ర సంగ్రామాన్ని ముందుండి నడిపించిన వీరుడికి నా సహస్ర శతకోటి వందనాలు.....ఈ రోజు ఆ మహనీయుడి జయంతి....స్మరించుకుందాము
 

Related Posts