YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నిమ్మగడ్డ వ్యవహారంలో ఇప్పుడే మొదలైన అసలు ట్విస్ట్! నియామకం అంత ఈజీ కాదా?

నిమ్మగడ్డ వ్యవహారంలో ఇప్పుడే మొదలైన అసలు ట్విస్ట్!  నియామకం అంత ఈజీ కాదా?

అమరావతి జూలై 23 
ఏపీ సీఎం జగన్ వర్సెస్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డను తిరిగి ఎస్ఈసీగా నియమించాలని జగన్ సర్కార్ కు గవర్నర్ హరిచందన్  సూచించారు. కానీ ఇంతటితో జగన్ సర్కార్ నిమ్మగడ్డను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నియమిస్తారనుకుంటే పొరపాటే.. ఈ వ్యవహారం ముగిసిపోలేదు. అసలు సినిమా ఇప్పుడే మొదలైందని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా.. గవర్నర్ ఆదేశాలు జారీచేసినా నిమ్మగడ్డ పునర్ నియామకం విషయంలో జగన్ సర్కార్ ముందుకెళుతుందా అంటే అనుమానంగానే కనిపిస్తోంది. ఎందుకంటే సీఎం జగన్ పట్టబట్టి మరీ చంద్రబాబు నియమించిన నిమ్మగడ్డను తొలగించారు. ఇప్పుడు ఆయనను నియమించమంటే నియమిస్తే నైతికంగా జగన్ ఓడిపోయినట్టే. అందుకే నిమ్మగడ్డ విషయంలో జగన్ ఏం చేస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే సుప్రీం కోర్టులో అంతిమ తీర్పు రాకముందే తమ పరిధిలో లేదని హైకోర్టు గతంలో తేల్చిచెప్పిన వ్యవహారంలో తాము మాత్రం ఎందుకు తొందరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.ప్రస్తుతం నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టిసింది. జస్టిస్ కనగరాజ్ నియామకంపై ఆర్డినెన్స్ మాత్రం ప్రభుత్వం కానీ గవర్నర్ కానీ ఉపసంహరించుకోలేదు. అంటే కనగరాజ్ ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవడంతో పాటు నిమ్మగడ్డ నియామకంపై గవర్నరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.సుప్రీం కోర్టు తీర్పులో రెండు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో హడావుడిగా నిర్ణయం తీసుకోలేమని గవర్నర్ కు ఏపీ సర్కార్ చెప్పే అవకాశం ఉంది. గవర్నర్ ఇంకా జస్టిస్ కనగరాజ్ నియామక ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవడం వంటి అంశాలు జగన్ సర్కార్ కు కలిసి వచ్చే అవకాశముంది. దీంతో ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ప్రభుత్వం దీన్ని సాగదీసే కొద్దీ నిమ్మగడ్డ మరో సారి హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు. మొత్తం కోర్టులతోనే నెట్టుకొచ్చిన నిమ్మగడ్డకు అదే కోర్టులతో జాప్యం చేస్తూ నాల్చాలని ఏపీ సర్కార్ భావిస్తున్నట్టు తెలిసింది.

Related Posts