టెలి కాన్ఫరెన్సుల ద్వారా పార్టీ నాయకులు, శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలతో అనుసంధానం అవుతున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ మీడియా విభాగం, సోషల్ మీడియా విభాగాల కోరిక మేరకు వారికి ప్రత్యేక ఇంటర్వ్యూను ఇచ్చారు. అనేక మంది జనసైనికులు కోరిక మేరకు ఈ ఇంటర్వ్యూ కోసం సమయం కోరగానే పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. కోవిడ్ నిబంధనలను పూర్తిగా పాటిస్తూ ఈ ఇంటర్వ్యూను ఇచ్చారు. చాతుర్మాస్య దీక్షలో ఉన్న పవన్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కొనుగోలు చేసిన చేనేత వస్త్రాలను ధరించారు. ఆ దీక్ష వెనుకగల విశేషాలను కూడా పంచుకున్నారు.
జాతీయ, ప్రాంతీయ అంశాలపై ఆయన సుదీర్ఘంగా తన అభిప్రాయాలను, జనసేన విధానాన్ని వెల్లడించారు. కరోనా విజృంభణ, ఆత్మనిర్భర భారత్ కార్యక్రమం ఆశయం, చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ ధృడ వైఖరి తదితర అంశాలపై తన మనసులోని మాటను వెల్లడించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణలో ప్రభుత్వ ఉదాసీన వైఖరి, దళితులపై దాడులు, గవర్నర్ కు చేరిన రాజధాని వికేంద్రీకరణ, సి.ఆర్.డి.ఏ.బిల్లులు, అమరావతి రైతుల ఆందోళనలు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, సన్నగిల్లిన వృత్తి ఆధారిత ఉపాధి, ఇసుక, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణ పథకం, పేదలకు ఇళ్ల స్థలాల వ్యవహారంలో అవకతవకలు, లాక్ డవున్లో జనసైనికుల సామాజిక సేవ, సినిమాకు సంబందించిన అనేకానేక విషయాలపై చాల ఓపికగా సమాధానాలు ఇచ్చారు. గంట పది నిముషాలసేపు సాగిన ఈ ఇంటర్వ్యూలో ఇంకా అనేక అంశాలు వున్నాయి. ఈ ఇంటర్వ్యూ తొలి భాగం రేపు మీ ముందుకు వస్తుంది.