అమరావత జులై 23
కోవిడ్ – 19 సమాచారంలో భాగంగా ప్రజలకు కరోనాకు సంబంధించిన విషయాలను తెలియజేయుటకు జిల్లా స్థాయిలో 104 కాల్ సెంటర్లు 24 గం. లు పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్ కమిషనర్ కె. భాస్కర్ పేర్కొనారు. గురువారం స్థానిక జిల్లా సచివాలయంలో అమరావతి నుండి ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్ కమిషనర్ కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా తీసుకోవలసిన జాగ్రత్తల పై వివిధ జిల్లాలలోని జిల్లా జాయింట్ కలెక్టర్లు, డిఎంహెచ్ఓ లు, డిసిహెచ్ఎస్ లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రోగ్రామ్ అధికారులు, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్ కమిషనర్ మాట్లాడుతూ 104 కాల్ సెంటర్లకు కాల్ చేసే వ్యక్తులు ముఖ్యంగా కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నాయని కరోనా పరీక్షలు చేయించుకోవాలని అలాగే కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నవాని అనుమానంతో శ్యాంపుల్ టెస్ట్ ల కొరకు కాల్ సెంటర్లకు ఫోన్ చేస్తుంటారని, కాల్ సెంటర్ నుండి ఆ వ్యక్తులకు సంబంధించిన వివరములను సంబంధిత వైద్యాధికారులకు పంపించి పర్యవేక్షణ చేయాలన్నారు. కరోనా పరీక్షల ఫలితాలు వెలువడిన వారిలో కరోనా పాజిటివ్ నిర్ధారించబడిన వారికి 104 కాల్ సెంటర్ ద్వారా సంబంధిత వైద్యాధికారులకు మెసేజ్ వెళుతుందని, సంబంధిత వైద్యాధికారులు ఆ వ్యక్తిని సందర్శించి వారి వ్యాధి లక్షణాల తీవ్రతను బట్టి హోమ్ క్వారంటైన్ లో ఉంచాలా లేక క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలా అలాగే ట్రైజిన్ కేంద్రాలకు తరలించాల అని నిర్ధారించుకుని ఆ వ్యక్తి యొక్క వివరములను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేంత వరకు 104 కాల్ సెంటర్ వారు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. కోవిడ్ – 19 ఇంస్టెంట్ ఆర్డర్ 67, 68 లోని నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క కరోనా పాజిటివ్ కేసులకు అందిస్తున్న చికిత్సలు, ఆసుపత్రుల యందు అందుబాటులో ఉన్న పడకల వివరములు, రోగుల సంఖ్య, డిశ్చార్జ్ అయిన వ్యక్తుల వివరములు ప్రతి రోజూ సంబంధిత ఆసుపత్రుల సూపరింటెండెంట్ ల ద్వారా సేకరించి హెల్ప్ డెస్క్ నుండి 104 కాల్ సెంటర్ కు పంపాలన్నారు. కోవిడ్ – 19 కు చికిత్సలు అందిస్తున్న ఆసుపత్రుల యందు హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు. అన్ని కోవిడ్ – 19 కు చికిత్సలు అందిస్తున్న మొదటి స్థాయి మరియు రెండవ స్థాయి ఆసుపత్రుల యందు మరియు అక్కడి వార్డుల యందు నిఘా కెమరాలు ఏర్పాటు చేయాలని, అలాగే వార్డు నందు ప్రతి రోగికి అందుబాటులో ఉండేలా అలారం ఏర్పాటు చేయాలని ఆసుపత్రి మేనేజ్మెంట్ నోడల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ క్వారంటైన్ సెంటర్ ల యందు మరియు ఆసుపత్రుల యందు సానిటేషన్ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేపట్టాలని అవసరమైన మేరకు కాంటాక్ట్ పద్ధతిలో సానిటేషన్ సిబ్బందిని నియమించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ – 19 వ్యాధితో ఆసుపత్రిలో ఎవరైనా చనిపోయినచో వారిని వెంటనే వార్డు నుండి తరలించి సానిటేషన్ మరియు డిస్ ఇన్ఫెక్షన్ చేయాలని ఆసుపత్రి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కరోనా పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాన్ని కంటైన్ మెంట్ మ్యాపింగ్ చేసి అలాగే కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి ఈ ప్రాంతం లో ఫీవర్ క్లినిక్ లను ఏర్పాటు చేసి శ్యాంపుల్ టెస్ట్ లు చేయడం అలాగే కరోనా లక్షణాలు ఉన్న వారిని స్వేయ నిర్బంధం లో లేదా క్వారంటైన్ కేంద్రాలకు తరలించడం అన్నది కరోనా నియంత్రణ చర్యల్లో గొలుసుకట్టు కార్యక్రమం లా వైద్యాధికారులు మరియు వైద్య సిబ్బంది భావించి తగిన విధంగా స్పందించాలన్నారు.