రాజమహేంద్రవరం : ఈనెల 21 నుండి 27 వరకూ ప్రత్యేకహోదా సాధనకోసం దశాలవారీ ఉద్యమం చేస్తామని ఎంపీ మురళీమోహన్ తెలిపారు. శుక్రవారం నాడు అయన రాజమండ్రీలో ఎమ్మెల్యేలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ లో అవిశ్వాసం పై చర్చకు అవకాశం ఉన్నా.. బిజెపి కావాలనే చర్చకు రానివ్వలేదు. రాబోయే కాలంలో బిజెపికి డిపాజిట్లకూడా రాకుండా చేస్తామని హెచ్చరించారు. మంత్రి జవహర్ మాట్లాడుతూ మోడీ హిట్లర్ లాగా, నయంతలాగా దేశాన్ని విభజించి పాలించాలని చూస్తున్నారు. నిన్న మోడీ చేసిన దీక్ష దొంగజపంలా ఉంది. అధికారదాహంతో దేశాన్ని విభజించి పాలించాలను కుంటున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడంవల్లే వార్డు మెంబర్ కూడా కాలేని మాణిక్యాలరావు లాంటివాళ్ళు మంత్రి అయ్యారని అయన విమర్శించారు. ఎంపీ హరిబాబు లాంటివాళ్ళు గెలవడానికి కూడా టిడిపి మద్దతే కారణమని అయన అన్నారు.