న్యూఢిల్లీ జూలై 23
ఎన్ఐటీ వంటి సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు 12వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ ఉంటేచాలని కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. జేఈఈ మెయిన్స్ 2020 పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు 12వ తరగతి మార్కులతో సంబంధం లేకుండా కేవలం ఉత్తీర్ణత సర్టిఫికేట్ ద్వారా ఎన్ఐటీ వంటి విద్యా సంస్థల్లో ప్రవేశం పొందవచ్చని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్స్‌లో తొలి 20 శాతం మందిలో స్థానం పొందటంతోపాటు 12వ తరగతి బోర్డు పరీక్షలో కనీసం 75 శాతం మార్కులు సాధించాల్సి ఉందని రమేశ్ ప్రోఖియాల్ తెలిపారు. అయితే కరోనా నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా, ఎన్‌ఐటిలు, ఇతర సిఎఫ్‌టిఐలలో ప్రవేశానికి అర్హత ప్రమాణాలను ఈ మేరకు సడలించాలని సెంట్రల్ సీట్ కేటాయింపు బోర్డు (సీఎస్‌ఏబీ) నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.