YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మిస్టర్. కేసీఆర్… నీ...ఆటలు కట్టిపెట్టు!

మిస్టర్. కేసీఆర్… నీ...ఆటలు కట్టిపెట్టు!

హైదరాబాద్ జూలై 23 
తెలంగాణ ముఖ్యమంత్రి  ఈ మద్య ప్రెస్-మీట్లు బందుచేసి ప్రెస్-'నోట్ల'ను పంపుతున్నారు.  అందులో భాగంగా ఇరిగేషన్ మీద సమీక్ష జరిపినట్లు పకడ్బందీగా 'ప్రగతిభవన్'లో ప్రగల్భాలు పలికారు. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు సూటిగా అడుగుతున్నానని మాజీ పీసీసీ ఛీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
 ఈ సంవత్సరం తెలంగాణలో  కోటీ ఇరవైమూడు లక్షల ఎకరాలకు నీరిస్తానని సెలవిచ్చారు.   అసలు మీరు వచ్చాక మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఎన్ని?  పూర్తి చేసినవి ఎన్ని?  ఆ ప్రాజెక్టుల నుండి ఎన్ని 'చుక్కల' నీరొచ్చింది?  ఆ విడుదల చేసిన నీటితో ఎన్ని ఎకరాలు సాగు చేసారు? ఎందుకీ...నాటకాలని అయన అన్నారు.
 మీరొచ్చిన తర్వాత కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డిలు రెండే ప్రాజెక్టులే కదా?  కాళేశ్వరం నుండి ఒక చుక్కైనా వాడుకోగలుగుతున్నామా?  గోదావరి నుంచి నాలుగు, కృష్ణా నుంచి మూడు టీఎంసీలు వాడుకుంటున్నామన్నారు కదా!  ఈ రోజుకు కూడా సముద్రంలో గోదావరి నీళ్లు ఎన్ని టీఎంసీలు కలుస్తున్నాయో తెలుసా ?   ఇప్పుడు కాళేశ్వరం నుంచి ఒక్క చుక్కైనా వాడుకోవడానికి ప్రయత్నం చేయండి మీ డొల్లతనం బయటపడుతుంది. గత సంవత్సరంలా!  కాళేశ్వరం నీళ్లు తేలేరు, తెచ్చినా వాడుకోలేరని గతేడాదే ప్రయోగాత్మకంగా తెలిసింది కదా!  ఎల్లంపెల్లి నీళ్లే వాడలేము ఇక కాళేశ్వరం నీళ్లేక్కడివి?   పాలమూరు-రంగారెడ్డికి నీళ్లొచ్చేనా?  మరి మీరు ప్రచారం చేస్తున్నట్టు కోటి ఇరవైమూడు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం సాధ్యమవుతుందా?  అసలు ఈ రాష్ట్రంలో బావుల కింద ఎంతుంది? చెరువుల కింద ఎంతుంది? మద్యతరహా ప్రాజెక్టుల కింద ఎంతుంది? భారీ ప్రాజెక్టుల కింద ఎంత ఆయకట్టుంది? ఎంత ఆయకట్టు అభివృద్ధి చేసాము చెప్పగలరా?  ఒక వైట్-పేపర్ విడుదల చేస్తారా? ఎందుకీ దగా,మోసం,ప్రచారమని అయన అన్నారు.
 మన రాష్ట్రంలో రైతులు ఎవరి ప్రమేయం లేకుండా, స్వయంగా ఏర్పాటు చేసుకున్న పంపుసెట్ల ద్వారానే యాభైలక్షల ఎకరాలకు నీరందుతుందని తెలుసా?  అసలు తెలంగాణ భూభాగం ఎన్ని ఎకరాలుందో తెలుసా? అందులో వ్యవసాయానికి అనుకూలంగా ఎంతుందో తెలుసా?  తెలంగాణలో మొత్తం సాగుభూమే కోటిపద్దెనమిది లక్షలు కదా? మరి మీరు చెప్పింది ఎలా సాధ్యమవుతుందో చెప్పండి?  మీరు సెంటిమెంటును రెచ్చగొట్టడం తప్ప తమ నలభైఏళ్ల రాజకీయ జీవితంలో రైతుల గురించి, వ్యవసాయం గురించి, నీళ్ల గురించి ఎప్పుడైనా మాట్లాడారా?  తెలంగాణలో 'సాగు' అంటేనే 'కాంగ్రెస్' అని మీకు తెలుసా? ప్రపంచంలో మొదటిసారిగా రైతుల రుణమాఫీ, సహకార రాయితీలు, వడ్డీమాఫీ, మద్దతుధర, ఉచితవిద్యుత్ ఇచ్చింది 'కాంగ్రెస్' అని తెలుసా?  2013 లో కాంగ్రెస్ హాయంలో తెలంగాణలో పండించిన దిగుబడిని ఈ ఆరేళ్లలో మీరు ఎందుకు అధిగమించ లేదో చెప్పండి?  పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు పెంచిన మద్దతుధర శాతమెంత? ఆరేళ్లలో మీరు పెంచిన శాతమెంత తెలియచేస్తారా?  ఇరవైనాలుగు గంటల కరెంటు అంటున్నారు. విచారిద్దాం రైతుల దగ్గరకు వస్తారా? గంటకు ఎంత నీరు పారుతుందో తెలుసా?   గతంలో కాంగ్రెస్ చేపట్టిన ముప్పైనాలుగు ప్రాజెక్టుల ఆయకట్టు, ఇప్పుడు మీ రెండు ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు బయటపెట్టండి! ప్రజలకు నిజం నిలకడ మీద తెలుస్తుందని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

Related Posts