YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజల వద్దకే పాలన మంత్రి హరీశ్ రావు

చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజల వద్దకే పాలన   మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి జూలై 23  
ముఖ్యమంత్రి  కేసీఆర్ ప్రత్యేక కృషితో ఏర్పడిన చిన్న జిల్లాలతో ప్రజలకు మెరుగైన పాలన అందుతున్నదని  ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.  కొత్తగా ఏర్పడిన అందోలు రెవెన్యూ డివిజన్ లో భాగంగా అందోలులో  ఆర్డీవో ఆఫీసును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిపాలన సౌలభ్యం కోసం చిన్నా జిలాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం..కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా ఏర్పాటు చేసిందని చెప్పారు. కొత్త డివిజన్లు, మండలాలు ఏర్పాటుతో పాలనలో పారదర్శకత పెరగడంతో పాటు దగ్గరలోనే ఉన్న కార్యాలయాలకు వెళ్లి ప్రజలు అధికారులను కలుసుకునే అకాశం ఏర్పడిందన్నారు. డివిజన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఎంతో కృషి చేశారని ప్రత్యేకంగా అభినందించారు. చిన్నా జిల్లాల ఏర్పాటుతో ప్రతి మారుమూల గ్రామాలకు అధికాలు వెళ్తున్నారు. అర్హు లైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. 33 జిల్లాలు ఎందుకని విమర్శించిన వారే.. పాలన ప్రజల దరి చేరడం చూసి సర్కారుకు అభినందించక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆందోల్, జోగిపేట డివిజన్ ఏర్పాటుతో ప్రజలకు మరింత త్వరగా సేవలు అందుతాయని తెలిపారు. అలాగే కొత్తగా ఏర్పడిన చౌటకూరు తాసిల్దార్ ఆఫీసును మంత్రి ప్రారంభించారు. కాగా, అందోలు మొదటి ఆర్డీవోగా రవి బాధ్యతలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జెడ్పీ చైర్ పర్సన్ మంజు శ్రీ,  కలెక్టర్ హనుమంతరావు , ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Related Posts