YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీలోనే కేఈ ప్రభాకర్

 టీడీపీలోనే కేఈ ప్రభాకర్

కర్నూలు, జూలై 24, 
కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. దశాబ్దాలుగా కర్నూలు జిల్లాను కేఈ కుటుంబం శాసించింది. తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ అత్యున్నత పదవులను పొందింది. అయితే గత ఎన్నికలు కేఈ కుటుంబాన్ని తేరుకోలేకుండా చేశాయి. రాజకీయంగా గట్టి షాక్ తగిలింది. డోన్, పత్తికొండల్లో కేఈ కుటుంబ సభ్యులిద్దరూ పోటీ చేసి ఓటమి పాలు కావడంతో కేఈ కుటుంబం తలెత్తుకోలేని పరిస్థితికి వచ్చిందిఅయితే ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కొద్ది నెలల క్రితం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు నచ్చక తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన వైసీపీలో చేరతారన్న వార్తలు వచ్చాయి. అయితే నెలలు గడుస్తున్నా కేఈ ప్రభాకర్ వైసీపీలో చేరలేదు. శాసనమండలి రద్దు నిర్ణయం వెలువడిన తర్వాతనే కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు. దీనిపై పార్టీలో పెద్దయెత్తున చర్చ జరిగింది కూడా. అయితే కేఈ కృష్ణమూర్తి రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఆయన కుమారుడు శ్యాంబాబు, మరో సోదరుడు ప్రతాప్ టీడీపీలోనే కొనసాగుతున్నారు.ఇటీవల శాసనమండలి సమావేశాల సందర్భంగా కేఈ ప్రభాకర్ కు స్వయంగా చంద్రబాబు ఫోన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని చంద్రబాబు ప్రభాకర్ కు నచ్చచెప్పినట్లు తెలిసింది. అయితే కేఈ ప్రభాకర్ కొంత మెత్తబడ్డారని తెలిసింది. తాను పార్టీకి వ్యతిరేకం కాదని, కొన్ని నిర్ణయాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నానని ఈ సందర్భంగా కేఈ ప్రభాకర్ చెప్పినట్లు పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది.ఇటీవల జిల్లాలో కేఈ ప్రభాకర్ కు, మరో వైసీపీ నేతకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీలో తనకు అవకాశం లేదని భావించిన కేఈ ప్రభాకర్ తిరిగి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. అయితే పార్టీ కార్యక్రమాల్లో ఇప్పుడే ఆయన పాల్గొనరని, టీడీపీకి సానుభూతిపరుడిగా కొనసాగుతారని చెబుతున్నారు. మొత్తం మీద కేఈ ప్రభాకర్ ఎందుకు రాజీనామా చేశారో? ఎందుకు మళ్లీ వెళ్లాలనుకుంటున్నారో ఆయనకే తెలియాలి

Related Posts