YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జీవీ ఆంజనేయులు వర్సెస్ బొల్ల బ్రహ్మనాయుడు

జీవీ ఆంజనేయులు వర్సెస్ బొల్ల బ్రహ్మనాయుడు

గుంటూరు, జూలై 24, 
వినుకొండ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఇక్కడ గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, వైపీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుల మధ్య వార్ రోజురోజుకూ ముదిరిపోతుంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులపై వైపీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు విజయం సాధించారు. జీవీ ఆంజనేయులు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అదే బ్రహ్మనాయుడు రెండు సార్లు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఒకసారి గెలిచారు. ఇద్దరి మధ్య రాజకీయ వైరం మామూలుగా లేదు.అయితే తాజాగా ఇళ్ల స్థలాల విషయంలో వీరి మధ్య వివాదం మరింత పెరిగింది. నువ్వా? నేనా? అన్న రీతిలో రోజూ ఇద్దరూ తలపడుతున్నారు. వినుకొండలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం ఐదు వేల మంది లబ్దిదారుల ఎంపిక జరిగిపోయింది. ఐదు వేల మందికి ఇళ్ల స్థలాలను ఇవ్వడం కోసం మొత్తం 105 ఎకరాలను కొనుగోలు చేశారు. అయితే ఈ స్థలమే వివాదమయి కూర్చుంది.105 ఎకరాల స్థలం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిదని, కారు చౌకగా కొని కోట్లాది రూపాలయకు ప్రభుత్వానికి విక్రయించారని జీవీ ఆంజనేయులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఈ 105 ఎకరాలు వినుకొండ నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండటాన్ని కూడా టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. నగరానికి దూరంగా పేదలకు స్థలాలు కేటాయించడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై విచారణ జరపాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. అంతేకాదు రేషన్ బియ్యంలోనూ అవినీతి నడుస్తుందని చెప్పారు.దీనికి బొల్లా బ్రహ్మనాయుడు ధీటుగానే కౌంటర్ ఇస్తున్నారు. ఆ స్థలం విషయాన్ని వదిలేసి జీవీపై కౌంటర్ ఎటాక్ ప్రారంభించారు. వినుకొండ నియోజకవర్గంలో ఆయన హయాంలో జరిగిన 2400 కోట్ల అభివృద్ధి ఎక్కడని ప్రశ్నించారు. పదిశాతం కమీషన్ తీసుకుని వదిలేశారన్నారు. అంతేకాకుండా ఏడు వేల కోట్ల రూపాయల విలువైన రేషన్ బియ్యాన్ని కృష్ణపట్నం పోర్టు కు జీవీ తరలించారని బొల్లా రివర్స్ ఆరోపణలు చేశారు. మొత్తం మీద పేదల ఇళ్ల స్థలాల ఎంపిక విషయంలో వైసీపీ అనేక నియోజకవర్గాల్లో ఆరోపణలను ఎదుర్కొంటోంది. అందులో వినుకొండ కూడా ఒకటి

Related Posts