వార్తలు రాజకీయం తెలంగాణ
తెరాస ప్లీనరీ కి తీర్మానాలు రూపొందించే పని ప్రారంభమయ్యింది. ఎన్ని తీర్మానాలు అనేది ఇంకా నిర్ణయించలేదని ప్లీనరి కమిటీ చైర్మన్ కె .కేశవ రావు అన్నారు. శుక్రవారం అయన మీడియా సమావేశంలో పాల్గోన్నారు. సంక్షేమంలో దేశం లోనే తెలంగాణ నంబర్ వన్ స్థానం లో ఉంది. సహజంగానే ప్లీనరీ లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఉంటుందని అయన అన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగం లో తెలంగాణ సాధించిన ప్రగతిని ప్లీనరీ లో చర్చిస్తాం. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని కెసిఆర్ ఇచ్చిన పిలుపు పై ప్లీనరీ లో చర్చిస్తాం. కేంద్ర రాష్ట్ర సంబంధాల పై చర్చ ఉంటుంది. తండాలను గ్రామ పంచాయతీ లుగా చేసిన అంశం పై చర్చిస్తామని అయన అన్నారు. రాజకీయ తీర్మానం ఉంటుంది. .రెండు రోజుల్లో తీర్మానాలు సిద్దమవుతాయి. ఈ భేటీ కి హాజరు కాని సభ్యులు త్వరలోనే సమావేశం లో పాల్గొంటారు. మంచి తీర్మానాలు ప్రజలకు మేలు జరిగే రీతిలో రూపొందుతాయని ఆశిస్తున్నానని అయన అన్నారు.
ప్లీనరీ తీర్మానాలు సిద్దమవుతున్నాయి : కేకే