YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రబీలో 28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

రబీలో 28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

అమ‌రావ‌తి: రబీలో 28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను సేకరించేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సచివాలయం పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే వారిపైన మరియు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైస్ మిల్లుల్లో బియ్యం లావాదేవీలకు సంబంధించి ఏ,బీ రిజిస్టర్లను ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. తొందరలో జిల్లాల వారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వివరాలను వెల్లడిస్తామన్నారు. పంటలో మార్పు తీసుకువచ్చి మన బియ్యం మనకే ఉపయోగపడేలా ఆలోచన చేస్తున్నామన్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజలు తినే ధాన్యాన్ని పండిస్తున్నారని, అందువల్ల ఆ రెండు జిల్లాల్లో పంపిణీ చేసిన బియ్యం అక్రమ రవాణా కావడం లేదని తెలిపారు. పౌర సరఫరాల శాఖకు తోడ్పాటును అందించాలని రైస్‌మిల్లర్లను కోరారు. గోనె సంచుల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. 2016-17 వరకు మిల్లర్లు నుంచి రావల్సీన సీఎంఆర్ (సీఎంఆర్ - ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చడం) బకాయిలు రూ. 97.95 కోట్ల వసూలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. హాస్టళ్లకు సరఫరా చేస్తున్న హాస్టళ్లు, మధ్యాహ్నం భోజన పథకానికి స్వర్ణ, ఎన్ఎల్ఆర్ వంటి మంచి బియ్యంతోపాటు స్టీమింగ్ బియ్యం సరఫరా చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. మిల్లర్లు టారిఫ్ కమిషన్ కు బ్యాలన్స్ షీట్, వ్యాపార వివరాలు ఇవ్వనందున మిల్లింగ్ చార్జీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి ప్రతిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు.దాదాపు 40 ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయం ప్రకారం రూ.12.50ల మిల్లింగ్ చార్జీలు చెల్లిస్తున్నారని, దానిని పెంచాలన్నారు. సీఎంఆర్ బియ్యం సరఫరా చేసిన వెంటనే తమకు రావల్సీన రావాణా చార్జీలు తమ ఖాతాలో జమ చేయాలన్నారు. తాము ప్రధానంగా ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను కూడా పరిష్కరించాలన్నారు. రైస్ మిల్లులను రక్షించేందుకు ప్రత్యేక కమిటీని వేసి క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులను రాష్ట్ర విజిలెన్స్ కమిటీలో మెంబర్లగా తీసుకోవాలని కోరారు.పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, మాట్లాడుతూ చిన్న రైస్ మిల్లర్లతో సహా ధాన్యం, బియ్యం నిల్వల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇవ్వని బియ్యంను ఇస్తున్నట్లు లెక్కలు చూపిస్తే సహించేది లేదన్నారు. కొన్ని పరిస్థితుల దృష్ఠ్య నెల్లూరు జిల్లా రైతులను ఆదుకోవాడనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బి.పి.టికి రూ.230 అదనంగా ఇస్తున్నారన్నారు. రైస్ మిల్లర్లు అవకతవకలకు పాల్పడితే లైసెన్స్ రద్దు చేస్తామని వెల్లడించారు. మిల్లర్లు ఎకతాటిపై ఉంటే పి.డి.ఎస్ బియ్యంను రిసైక్లింగ్ చేయడానికి అవకాశం ఉండదని, పేద ప్రజలకు మంచి బియ్యం అందించేకు మిల్లర్లు కూడా సహకరించాలన్నారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను నిర్మించడానికి సీఎం గారి పర్మిషన్ ఇస్తే వాటిని నిర్మించకుండా కొంత మంది అడ్డుతగులుతున్నారని అన్నారు. ఎంఎల్‌ఎస్ పాయింట్లలో ఈ-పోస్ మిషన్లు బాగా పనిచేస్తున్నాయని కొన్ని చోట్ల చిన్నచిన్న సమస్యలు వచ్చిన వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా రైస్ మిల్లర్లు కమిషర్‌తో మాట్లాడుతూ బ్యాంకుల ఇబ్బందుల వల్ల ఏ,బి రిజస్టర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేకపోతున్నట్లు తెలిపారు

Related Posts