YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

గుడ్ న్యూస్ చెప్పేసిన గ్లెన్ మార్క్

గుడ్ న్యూస్  చెప్పేసిన గ్లెన్ మార్క్

ముంబై, జూలై 24,
ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న వేళ ప్రముఖ అంతర్జాతీయ ఔషధ సంస్థ గ్లెన్‌మార్క్ శుభవార్త అందించింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో సత్ఫలితాలు వస్తున్నట్లు పేర్కొంది. దేశంలో తాము నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్‌లో కేవలం నాలుగో రోజునే 69.8 (సుమారు 70%) మంది పేషెంట్లు కరోనా నుంచి కోలుకున్నారని సంస్థ  ప్రకటించింది. తమ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తోందని వెల్లడించింది. మూడో దశ ప్రయోగాల్లో తమ ఔషధం ‘ఫావిపిరవిర్’ 28.6 శాతం అధికంగా వైరస్ నుంచి క్యూర్ చేస్తున్నట్లు గుర్తించామని తెలిపింది.దేశంలో 3వ దశ క్లినికల్‌ పరీక్షలకు చేరుకున్న తొలి కంపెనీ తమదేనని గ్లెన్‌మార్క్‌ ఫార్మా తెలిపింది. దేశంలో ఏడు కేంద్రాల్లో క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఆగస్టు నాటికి తమ అధ్యయనం పూర్తవుతుందని తెలిపింది. తమ డ్రగ్ అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకొని అతి త్వరలో మార్కెట్‌లోకి అడుగు పెడుతుందని పేర్కొంది.డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) గత నెలలోనే ఫావిపిరవిర్‌ యాంటీ వైరల్‌ ట్యాబెట్ల పని తీరుపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు గ్లెన్‌మార్క్‌ ఫార్మాకు అనుమతులు ఇచ్చింది. ఈ అధ్యయనం కోసం దేశంలో 10కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు నమోదు చేసుకున్నాయని ఆ సంస్థ పేర్కొంది.కొవిడ్‌-19 పాజిటివ్‌ రోగులకు చికిత్స వ్యవధి గరిష్టంగా 14 రోజులు, అధ్యయన వ్యవధి 28 రోజుల వరకు ఉంటుందని గ్లెన్‌మార్క్‌ ఫార్మా తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 160 వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో నాలుగు మాత్రమే కీలక దశకు చేరుకున్నాయి. జూన్‌ 25న చైనాలో ఒక వ్యాక్సిన్‌ను అక్కడి ప్రభుత్వం ఆమోదించింది. దీన్ని ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్‌‌గా చెబుతున్నారు. అటు ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ పైనా క్లినికల్ ట్రయల్స్‌ విజయవంతంగా కొనసాగుతున్నాయి.

Related Posts