YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

పోలీసుల అదుపులో బైకు రేసు రైడర్

పోలీసుల అదుపులో బైకు రేసు రైడర్

బెంగళూరు జూలై 24, 
భారతదేశంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వా లు కరోనా నివారణలో భాగంగా 2 వ దశ లాక్ డౌన్ అమలు చేశాయి. అంతే కాకుండా కర్ణాటకలోని వివిధ జిల్లాల్లో వారం రోజుల లాక్ డౌన్ విధించారు.కరోనా లాక్ డౌన్ సమయంలో అవసరమైన వస్తువులను కొనడానికి మాత్రమే బయటకి రావాలనే నియమం కూడా ఉంది. లాక్ డౌన్ సమయంలో అనవసరంగా బయటకు వచ్చే వాహనదారులను పోలీసులు కఠినంగా శిక్షించడమీ కాకుండా వారిపై చర్యలు తీసుకుం టున్నారు.ఈ క్రమంలో లాక్ డౌన్ సమయంలో అనవసరంగా బయటకి వచ్చిన వాహనదారుల వాహనాలను కూడా సీజ్ చేస్తున్నారు.కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ రకమైన కఠిన నిబంధనల కారణంగా ప్రజలు రోడ్డుపైకి రావడానికి భయపడుతు న్నారు. ఈ కారణంగా చాలా వరకు రహదారులు నిర్మానుష్యంగా మారాయి. రోడ్లు నిర్మానుష్యంగా మారటంతో బైక్ రైడర్స్ చెలరేగిపోతున్నారు.
లాక్ డౌన్ సమయంలో రహదారులన్నీ ఖాళీగా ఉండటం వల్ల బెంగళూరులో ఇప్పటికే బైక్ స్టంట్స్ ఓవర్ స్పీడింగ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ మరియు ఓవర్ స్టెడ్స్ కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది బైకర్లు సోషల్ నెట్వర్క్లలో ఎక్కువ లైక్లు మరియు ఫాలోవర్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నా రు.అయితే ఓవర్ స్పీడ్ బైక్ రైడింగ్ మరియు బైక్ స్టంటర్లపై ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించిన బెంగళూరు పోలీసులు, ఓవర్ స్పీడ్ బైక్ నడుపుతున్న కేటుగాళ్ళు పై దృష్టి సారిస్తున్నారు.లాక్ డౌన్ సమయంలో ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్లో గంటకు గరిష్టంగా 299 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసును తీవ్రంగా పరిగణించిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు, రైడింగ్ చేయడానికి ఉపయోగించిన బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నారు.కరోనా సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలే కానీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related Posts