రాజమండ్రి జూలై 24,
తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టెషన్ పరిదిలో వున్న సుకుమామిడి పరిసర అటవీప్రాంతం నుండి చింతూరు వైపు వెళుచున్న లారిలొ 40 గోనేసంచు బస్తాల్లో 1000 కే.జిల గంజాయి వున్నట్లు గుర్తించారు.దబ్బగూడెం, తూలుగొండ గ్రామాలవద్ద పోలీసులు వాహనాలను తనిఖి చెస్తుండగా సుకుమామిడి గ్రామం నుండి అలహాబాద్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.అరెస్ట్ చేసిన ఇరువురు ముద్దాయిలను రంపచోడవరం కోర్టుకు తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.లారిని మోతుగూడెం పోలిస్ స్టెషన్కు తరలించి షిజ్ చేసారు.పైలెట్ గా వెళుతున్న గంజాయి ఓనరు ప్రకాశ్ అనేవ్యక్తి సంఘాటన స్దలం వద్ద మోటారు సైకిల్ వదలి పారిపోయాడు.పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే స్మగ్లర్లు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న మోతుగూడెం పోలీసులు అక్రమ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతు స్మగ్లర్ గుండెల్లొ రెళ్లు పరిగెట్టిస్తు గత ఎనిమిది నెలల్లొ సుమారు పదివేల కే.జి.ల గంజాయిని ఈ మోతుగూడెం స్టెషన్ పోలీసులు వాహనాల స్వాదినం చేసుకున్నారు.