కౌతాళం జూలై 24
గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.శ్రావణమాసం లో మొదటి శుక్రవారం ఆడపడుచులు నాగుల చవితి సంధర్భంగా నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నే లేచి స్నానమాచరించి కొట్టబట్టలు వేసుకుని పాలు, నైవేద్యాలు తీసుకుని నాగదేవత,విగ్రహాలు దగ్గర, పాము పుట్టాల దగ్గర జెమ్మే చెట్లు దగ్గర వారి వారి ఇష్ట మైన దగ్గర పాలభిషేకం చేసి పూలు వేసి టెంకాయలు కొట్టి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆనవాయితి వస్తున్నా ఆచారం నాగదేవతలకు పాలు పోసి ఉరుకుందఇరన్న స్వామివారి కు మొక్కులు తీర్చుకునే వారు ఈసారి కరోన వైరస్ విజృంభిస్తున్న వేళా శ్రావణమాసం లో ఉరుకుంద ఇరన్న స్వామి దర్శనాలు నిలిపి వేయడంతో భక్తులు ఇంటి వద్దే మరియు నాగదేవత విగ్రహాలు దగ్గర ఇరన్న స్వామి పేరు తో టెంకాయలు నైవేద్యాలు పెట్టి మొక్కలు తీర్చుకున్నారు. అన్ని గ్రామాల్లో నాగుల చవితి పండుగ జరుపుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.