YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం విదేశీయం

ప్రభుత్వ కాంట్రాక్టుల నుంచి చైనా తప్పిస్తూ భారత్ మరో కీలక నిర్ణయం

ప్రభుత్వ కాంట్రాక్టుల నుంచి చైనా తప్పిస్తూ భారత్ మరో కీలక నిర్ణయం

న్యూ ఢిల్లీ  జూలై 24  
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తుంది. భారత్ ను దెబ్బకొట్టాలని చూస్తున్న దేశాలపై కొత్త కొత్త ఆంక్షలు విధిస్తు వారికీ దిమ్మతిరిగేలా చేస్తుంది. గాల్వానా ఘటన తర్వాత చైనాకి చెందిన 59 యాప్స్ ను నిషేధించి షాక్ ఇచ్చిన కేంద్రం తాజాగా మరో నిర్ణయం తీసుకోని కోలుకోలేని దెబ్బ కొట్టింది. దేశంలో ఎక్కువుగా ప్రభుత్వ కాంట్రాక్టులు పొంది భారీగా లాభాలు అందుకుంటున్న  చైనా కంపెనీలకు షాక్ ఇస్తూ  కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం డ్రాగన్ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ తగలబోతోంది. ఇప్పటికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రద్దుతో చైనా కంపెనీలకి షాక్ ఇచ్చిన కేంద్రం.... ఈసారి వారిని భారత ప్రభుత్వ కాంట్రాక్టుల నుంచి తప్పిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది.  భారత్ తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలకు చెందిన కంపెనీలకు భారతీయ కాంట్రాక్టుల నుంచి తప్పిస్తున్నట్లు కేంద్రం ఓ  ప్రకటన విడుదల చేసింది. ఇది  దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. కానీ ఇది ముఖ్యంగా చైనాను ఉద్దేశించి తీసుకున్న కీలక నిర్ణయం అని తెలుస్తుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై భారత్ తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలకు చెందిన కంపెనీలకు భారత ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామలయ్యేందుకు అవకాశం ఉండదు. ఇతర దేశాల కంపెనీలకు మాత్రం యథావిధిగా అవకాశాలు ఉంటాయి. సబ్ కాంట్రాక్టులకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం తెలిపింది. కేంద్రం ప్రకటన  చూస్తే చైనాతో పాటు ఆ దేశానికి సహకరిస్తున్న పాకిస్తాన్ నేపాల్ బంగ్లాదేశ్ పైనా ప్రభావం భారీగా పడనున్నట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా ఈ నిర్ణయం చైనా పాకిస్తాన్ పై అధికంగా చూపిస్తుంది అని అంచనా.
కేంద్రం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని బట్టి ..  ఇకపై విదేశీ కంపెనీలు పొరుగుదేశాలకు చెందినవో కావో ముందుగానే చెక్ చేసుకోవాలి. ఆ తరువాతే  ప్రక్రియకు అనుమతి లభిస్తుంది. ఆయా కంపెనీల స్ధానికతను నిర్ధారించేందుకు కేంద్రం.. ఓ ప్యానెల్ ను కూడా ఏర్పాటు చేస్తోంది. ఇందులో హోం విదేశాంగ శాఖలతో పాటు వాణిజ్య మంత్విత్వశాఖకు చెందిన ప్రతినిధులకు స్ధానం కల్పిస్తున్నారు. ఈ మూడు శాఖలు నిర్ధారించిన తర్వాతే విదేశీ సంస్ధలకు ఇకపై భారత ప్రాజెక్టుల్లో పెట్టుబడులు భాగస్వామ్యానికి అనుమతి లభిస్తుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో చైనాకి కష్టాలు తప్పవని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Related Posts