YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ఆక్సిజన్ లేక ప్రాణం కోల్పోయిన జర్నలిస్ట్

ఆక్సిజన్ లేక ప్రాణం కోల్పోయిన జర్నలిస్ట్

రాజమండ్రి జూలై 24  
కరోనా బాధితులకు తగిన రీతిలో వైద్యం అందించడంలో విఫలమయిన ప్రభుత్వాసుపత్రి నిర్వాహకం ఓ సీనియర్ జర్నలిస్ట్ ప్రాణం తీసింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ లో టీవీ5 విలేకరిగా పదేళ్ల నుంచి పనిచేస్తన్న రాము(52) వారం రోజులుగా కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రాజమండ్రి జిల్లా ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కోసం తరలించారు. శ్వాస సమస్య తీవ్రం కావడంతో తల్లడిల్లిపోతున్న బాధితుడి గురించి స్థానిక విలేకరులు పదే పదే అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఆక్సిజన్ కొరత తీర్చడంలో విఫలమయ్యారు. ఆస్పత్రిలో అవసరమైన దానిలో 10శాతం కూడా సరఫరా చేయలేకపోయారు. దాంతో విలవిల్లాడుతూ తుదిశ్వాస విడిచే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఈ ఆస్పత్రిలో పదుల సంఖ్యలో బాధితులది ఇదే పరిస్థితి. విలేకరి మరణం అత్యంత విషాదకరం. ఇప్పటికైనా ఆక్సిజన్ అందుబాటులో ఉంచకపోతే రోగులు పిట్టల్లా రాలిపోయే ప్రమాదం ఉంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ తగిన విధంగా వ్యవహరించలేకపోవడం, జిల్లా అధికారుల స్పందన రాకపోవడంతో రాజమండ్రి ఆస్పత్రి లో మరణమృదంగా తప్పదా అనే ఆందోళన అందరిలో మొదలయ్యింది. తక్షణం స్పందించాలని ఆశిద్దాం

Related Posts