YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి దేశీయం

ఆన్లైన్ చదువుల కోసం అవును అమ్మి ఫోన్ కొనిచ్చిన తండ్రి !

ఆన్లైన్ చదువుల కోసం అవును అమ్మి ఫోన్ కొనిచ్చిన తండ్రి !

షిమ్లా జూలై 24  
కరోనా మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తూ మనుషుల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. కరోనా వైరస్ వెలుగులోకి రాకముందు  పిల్లలు స్మార్ట్ ఫోన్ పట్టుకుంటే తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టు తిట్టేవారు ఎప్పుడూ ఫోన్ లో ఏంచేస్తుంటావ్ అని అరిచేవారు. కానీ కరోనా వెలుగులోకి వచ్చిన తరువాత వారే  స్వయంగా స్మార్ట్ ఫోన్లు చార్జింగ్ పెట్టి మరీ అందిస్తున్నారు. కరోనా కారణంగా స్కూల్స్ కి వెళ్లి చదివే రోజులు కనిపించడం లేదు. చాలావరకు ప్రస్తుతం  ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఆన్ లైన్ చదువులు పేద కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి . కరోనా పూర్తిగా తగ్గేవరకూ క్లాసులు చెప్పవద్దు అని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన కూడా కొన్ని విద్యాసంస్థలు కాసుల కోసం కక్కుర్తిపడి ఆన్ లైన్ క్లాసులంటూ మరో బిజినెస్ కి తెరతీశాయి. ఆన్లైన్ క్లాసులకి హాజరు కావాలంటే మొబైల్ ఫోన్ తప్పనిసరి. కరోనా నేపథ్యంలో బతుకుబండినే కష్టంగా ముందుకు సాగిస్తున్న పేదవారికి ఈ ఆన్ లైన్ క్లాసులు మరింత భారంగా మారుతున్నాయి. కానీ పిల్లల చదువు కోసం  స్మార్ట్ ఫోన్ కొనాల్సిన పరిస్థితి. దీనితో చాలామంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తమ పిల్లలకి మొబైల్ ఫోన్స్ ను కొంటున్నారు. తాజాగా  హిమాచల్ ప్రదేశ్లో ఓ వ్యక్తి  పిల్లల ఆన్ లైన్ చదువుల కోసం ఏకంగా తమ జీవనాధారమైన ఆవు అమ్మేశాడు. కాంగ్రా జిల్లా జ్వాలాముఖికి చెందిన కుల్దీప్ కుమార్ పిల్లలు స్మార్ట్ ఫోన్ లేక ఇటీవల ఆన్ లైన్ క్లాసులకు హాజరుకాలేకపోతున్నారు. ఆయన పిల్లలు నాలుగో తరగతి రెండో తరగతి చదువుతున్నారు.తోటి పిల్లలంతా ఆన్ లైన్ క్లాసులకు వెళ్తుండటంతో ఇక ఆ తండ్రి తన పిల్లల కోసం స్మార్ట్ ఫోన్ కొనాలుకున్నాడు. కానీ చేతిలో డబ్బు లేదు.  దానితో ఉన్న ఒక్క ఆస్తి అయిన ఆవును అమ్ముకున్నాడు.
అంతకుముందు స్మార్ట్ ఫోన్ ను కొనేందుకు ఆరు వేలు అప్పు కావాలని స్థానిక బ్యాంకుల్లో అడిగాడు.  కానీ బ్యాంకు వారు రుణానికి నిరాకరించారు. దానితో  చేసేదేం లేక జీవనాధారమైన అవును అమ్మకానికి పెట్టేశాడు. ఆ ఆవును అమ్మగా వచ్చిన డబ్బులో ఆరు వేలు పెట్టి తన పిల్లలకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. తనకు రేషన్ కార్డు కూడా లేదని పంచాయతీ వారు పట్టించుకోవడం లేదని తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే దీనిపై స్పందించి సాయం చేయాలని అధికారులకు సూచించారు.

Related Posts