YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమ్మకానికి మరో 1600 ఎకరాలు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం!

అమ్మకానికి మరో 1600 ఎకరాలు..     జగన్ సర్కార్ సంచలన నిర్ణయం!

అమరావతి జూలై 24  
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇప్పుడు అదో పెద్ద సంచలనంగా మారుతుంది. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించి ..రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకి దారితీసింది. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నా కూడా ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లును మండలిలో అడ్డుకోకపోతే ..ఇప్పటికే రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు అయ్యేవి. అయితే కాస్తా ఆలస్యం అయినా కూడా మూడు రాజధానులు ఏర్పాటు తథ్యం అని వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే అమరావతి ప్రాంత రైతులు.. టీడీపీ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ సర్కార్ మూడు రాజధానులని కట్టుబడి ఉందని చాటిచెప్తూ... తాజాగా మరోసారి అమరావతి ప్రాంతంలోని ప్రభుత్వ భూములని అమ్మకానికి పెట్టి మరో చర్చకి దారితీసింది. రాష్ట్రంలో చేపట్టబోతున్న అభివృద్ధి పథకాలు ఇతర ప్రాజెక్టుల కోసం అవసరమైన నిధులను సమీకరించుకోవడంలో భాగంగా రాజధాని అమరావతి ప్రాంత పరిధిలోని భూములను విక్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం అమరావతి పరిధిలో ఉన్న 1600 ఎకరాల భూములని గుర్తించినట్లు సమాచారం. ఈ భూములను విక్రయించడం ద్వారా వచ్చిన నిధులు మిషన్ బిల్డ్ ఏపీకి బదలాయిస్తారని చెబుతున్నారు. ప్రభుత్వ భూములను విక్రయించాలని భావిస్తున్నట్లు మిషన్ బిల్డ్ ఏపీ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర హైకోర్టు కు ఓ నివేదిక అందించినట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వం ఆ భూములని సింగపూర్ కన్సార్టియానికి అప్పగించింది. ప్రస్తుతం ఆ పనుల నిర్మాణం ఆగిపోయింది. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయడానికి జగన్ ప్రభుత్వం నిర్ణయించుకున్న నేపథ్యంలో సింగపూర్ కన్సార్టియం అమరావతి ప్రాజెక్టు నుంచి వైదొలగింది. దీనితో సింగపూర్ కన్సార్టియానికి కేటాయించిన భూములు రాష్ట్ర ప్రభుత్వం చేతికి వచ్చాయి. దీనితో  వాటిని విక్రయించాలని తాజాగా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. గుంటూరు విశాఖపట్నంలల్లో తొమ్మిది ప్రాంతాల్లో భూములను అమ్మకానికి ఉంచడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటీషన్పై విచారణ సందర్భంగా ప్రవీణ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారని తెలుస్తుంది. సీఆర్డీఏ బిల్లును రద్దు చేయడానికి అమరావతిని చట్టసభల రాజధానిగా మాత్రమే పరిమతం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సింగపూర్ కన్సార్టియాన్ని కొనసాగించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని ప్రభుత్వం భావించి ఆ భూములని అమ్మాలని చూస్తున్నట్టు సమాచారం. చూడాలి మరి ఇప్పటికే ప్రభుత్వం పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం మళ్లీ భూముల అమ్మకానికి సిద్దపడుతుండటంతో ఇంకెన్ని విమర్శలు వస్తాయో ...

Related Posts