YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టీ కల్చర్ యాప్ ఆవిష్కరంచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

టీ కల్చర్ యాప్ ఆవిష్కరంచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ జూలై 24 
మంత్రి  కేటీఆర్  జన్మదినం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు, కళాకారులను మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్   సహకారంతో రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ ను   రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక,  సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్  రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం కళల ఖజానా గా అభివర్ణించారు. రాష్ట్రంలో ఎంతోమంది జానపద, గిరిజన, శాస్త్రీయ, లలిత కళాకారులున్నారు. వారందరికి సంభందించిన డేటా బేస్, ఆన్ లైన్ మరియు మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు, కళాకారులను మరింత చేరువ చేసేందుకు ఈ ప్రత్యేక మొబైల్ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి,  కళాకారులకు పూర్వవైభవం కోసం అనేక సంక్షేమ  కార్యక్రమాలు చేపట్టారన్నారు. అందులో భాగంగా కళాకారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలనే సంకల్పంతో మధ్యవర్తులకు తావు లేకుండా, మారుమూల ప్రాంతాలలో ఉన్న కళాకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా " ఆన్ లైన్ " ద్వారా గుర్తింపు కార్డులను జారీ చేసే విధానం , కళాకారుల డేటా బేస్ ను రూపొందించి వారి జన్మస్థలం, కళారూపం, వయస్సు, చదువు, సాధించిన విజయాలు వంటి విషయాలు  మరియు యాప్ ద్వారా ప్రజలకు, కళాకారుల సమాచారం కోసం ప్రత్యేకంగా టీ కల్చర్  పేరుతో రూపొందించిన ఈ మొబైల్ యాప్ దేశంలోనే మొదటి ప్రయత్నం అని పేర్కొన్నారు.

Related Posts