విశాఖపట్నం జూలై 24
మద్యం షాపులు తెరిచి విచ్చలవిడిగా అమ్మకాలు జరపడంతో కరోనా మరింత వ్యాప్తి చెందుతోందన్నారు టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయంలో మద్యం బాటిళ్లతో టీడీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. కరోనా కారణంగా మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షలు ప్రకటించాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. విశాఖలో కలెక్టర్ ఉన్నారా.. లేదా.. అని అర్ధం కావట్లేదని ఎమ్మెల్యే మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కరోనాను సీరీయస్గా తీసుకోవట్లేదని.. ఆయన నిర్లక్ష్యం వల్లనే కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని గణేష్ ఆరోపించారు. కోవిడ్ కేంద్రాల్లో సదుపాయాలు దారుణంగా ఉన్నాయని.. సరైన పౌష్టికాహారం అందట్లేదన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులను దోచుకుంటున్నాయని విశాఖ జిల్లా కలెక్టర్ బాధ్యతగా ఉండాలని కోరారు.విశాఖ కరోన కేసులు విపరీతం గా పెరుగుతు న్నాయని చెప్పారు.ముఖ్యమంత్రి అసలు కరోన ను సీరీయస్ గా తీసుకోవడం లేదని,సీఎం నిర్లక్ష్యం వలనే కేసులు విపరీతం గా పెరిగిపోతున్నాయని చెప్పారు. కొవిడ్ కేంద్రాల లో సదుపాయాలు దారుణమని,సరైన పౌష్టికాహారం అందడంలేదని చెప్పారు.కేంద్రం ఇస్తున్న 500 రూపాయలు కరోన బాధిత కుటుంబాలకు అందించాలని కోరారు.విశాఖ జిల్లా కలెక్టర్ బాధ్యతగా ఉండాలి. కరోన కి సంబంధించి వాస్తవ పరిస్థితి తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.వైసీపీ నేతలు ఇష్టానుసారంగా తిరిగి కరోన వ్యాప్తి చేశారని,మద్యం కోసం జనాలు క్యూలో నిలిచిఉండటం దారుణమని చెప్పారు.మందుబాబులు వలన వారి కుటుంబాలు కూడ కరోన బారిన పడుతున్నారనిఅసలు ఇటువంటి సమయంలో మద్యం అమ్మకాలు అవసరమా అని నిలదీశారు.మద్యం షాపులను వెంటనే మూసివేయాలని కోరారు.