YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైఎస్ఆర్ కు పాలాభిషేకం

వైఎస్ఆర్ కు పాలాభిషేకం

కడప జూలై 24 
కడపలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర గల వైయస్ఆర్ విగ్రహానికి నూర్ బాష్ దూదేకుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సుంకేసుల బాదుల్లా ఆధ్వర్యంలో వైయస్ఆర్ విగ్రహానికి పాలతో అభిషేకం చేసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలలో ఒకటేనా దూదేకుల వీరికి మొట్ట మొదటిసారిగా 2010 సంవత్సరంలో ఫెడరేషన్ ఏర్పాటు చేసిన ఘనత దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కి దక్కిందని ఆయన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ దూదేకుల కార్పొరేషన్ చేయాలనే కళ నిజం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు. అంతేకాకుండా చైర్మన్, డైరెక్టర్లను నియమిస్తున్నందుకు ప్రత్యేక కార్పొరేషన్ చేస్తున్నందుకు దూదేకుల వారు జీవితంలో జగన్మోహన్ రెడ్డి ని మర్చిపోరని బీసీల వెన్నముక సీఎం జగన్ తన మాట నిలుపుకొనే విధంగా సీఎం  తన తండ్రి ఆశయాలు నెరవేర్చే తనయుడు అని భవిష్యత్తులో మరిన్ని నిధులు, పదవులు మా వారికి కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Posts