వనపర్తి జూలై 24
జిల్లా దవాఖానను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టరేట్ లో వివిధ ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించారు. వనపర్తి పట్టణ అభివృద్ధి కోసం కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి కలెక్టర్ యాస్మిన్ భాషాను అడిగి తెలుసుకున్నారు. జిల్లా దవాఖానలో ఏం కావాలో వివరాలు ఇవ్వాలన్నారు. వెంటిలేటర్లను వినియోగంలోకి తీసుకురండని సూచించారు. కరోనా విపత్తులో వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు ఎంతో గొప్పవన్నారు. వైద్యం కోసం వచ్చే ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. హరితహారం కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. అలాగే రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. రైతు వేదికల నిర్మాణం వేగవంతం చేసి దసరాకు అన్నీ సిద్ధం చేయాలన్నారు. మున్సిపాలిటీలో ఉన్న ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.