YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ బిల్లు పైఅవగాహన కార్యక్రమాలు

ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ బిల్లు పైఅవగాహన కార్యక్రమాలు

న్యూఢిల్లీ జూలై 25,
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడంతోపాటు ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశపెట్టి ఏడాది అవుతున్నది. ఈ నేపథ్యంలో వీటిపై కార్యక్రమాలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతున్నది. ఈ రెండు చట్టాలు అమలులోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా సంబంధిత కార్యక్రమాలు నిర్వహించాలంటూ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, ఇంచార్జీలకు లేఖలు రాసింది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తని కల్పించే ఆర్టికల్ 370ని గత ఏడాది ఆగస్టు 5న రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లఢక్ కేంద్ర పాలిత పాంత్రాలుగా విభజించింది. ఇక త్రిపుల్ తలాక్ నేరమంటూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు గత ఏడాది జూలై 30న పార్లమెంట్ ఆమోదించడంతో చట్టంగా మారింది.

Related Posts