దేవుడు ఒకడి భక్తికి మెచ్చి “ నీకు ఏవరం కావాలో అడుగు” అన్నాడుఆ భక్తుడు “స్వామీ! నువ్వు నన్ను కాపాడుతూ, ఎప్పుడూ నాతోనే ఉండాలి” అన్నాడు. “ భక్తుడిని రక్షించడమే భగవంతుడి పని, తప్పక నీతోనే ఉంటాను “ అని మాట ఇచ్చాడు. భక్తుడు పొంగిపోయాడు.
#ఒకసారి సముద్ర తీరంలో భక్తుడు నడుస్తూండగా, ఒక పులి అతని వెంటపడింది. భక్తుడు భయంతో పరుగులు పెట్టాడు. అంతవరకూ భక్తునితో, భగవంతుడు కూడా నడుస్తున్నట్లుగా ఇసుకలో కాలి గుర్తులు కనిపించేవి. పులి తరమడం మొదలెట్టాక భగవంతుడి కాలి గుర్తులు మాయమైపోయాయి. కొంతసేపటికి పులి వెళ్లిపోయింది. అప్పుడు #భగవంతుని కాలి గుర్తులు కనిపించడం మొదలుపెట్టాయి. “ ఇదేం అన్యాయం స్వామీ! పులి నన్ను తరిమినంతసేపూ నీ కాలిగుర్తులు మాయమైపోయాయి. నా కాలిగుర్తులు మాత్రమే కనిపించాయి. ఎక్కడికి పారిపోయావు “ అని అడిగాడు. దానికి సమాధానంగా భగవంతుడు “ నువ్వు నీకాలి గుర్తులు అనుకునేవి నీ కాలి గుర్తులు కావు, ఆ గుర్తులు నావి, అప్పుడు పులినుండి రక్షించడానికి రెండుచేతులతో నిన్ను ఎత్తుకున్నాను” అని నవ్వుతూ చెప్పాడు.
ఇది చదివినప్పటినుండి భగవంతుడు నేరుగా మన చెంతకువచ్చి ఏదీ ప్రదర్శించడు అని అర్ధమైంది. మనకు మంచి చేసే ఉద్దేశం ఉంటే పెద్ద ప్రదర్శన లేకుండానే చేసేస్తాడు. పూర్వం ఋషులు తలక్రిందులు అయితేకానీ ఆయన దర్శనం అయ్యేదికాదు. వారి ముందు మనం ఎంత.
ఒక ప్రముఖ వైద్యుడిని కలవాలంటే నెల రోజుల ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలి. మరి ప్రపంచాన్ని ఏలే వాడి దర్శనం కావాలంటే ఎంత తాపత్రయపడాలో అర్థంచేసుకోండి.
మానవుడిది చాలా చిన్ని జీవితం.
ఎదుటి మనిషిపట్ల అనురాగం, ఆప్యాయత, ప్రేమ, విశ్వాసం, పెద్దవారిని దగ్గరకు తీసుకుని ఓదార్చటం, పచ్చని చెట్లను పెంచటం, ఉదయం లేచిన వెంటనే దేవుడిని తలచుకోవటం, అందరితో చిరునవ్వుతో మాట్లాడటం, పెద్దవారు కనపడగానే నమస్కరించడం ఇటువంటివి ఆ భగవంతుడికి సమర్పించే కానుకలకన్నా మిన్న. కోట్ల మందిలో అటువంటి భక్తుడు ఎక్కడ ఉన్నా ఆయన దగ్గరకు లాక్కుని అక్కున చేర్చుకుంటాడు.
పిల్లవాడు తల్లి నోటిలో ఏదైనా పెడితే “నువ్వు తినరా” అంటూ తిరిగి వాడి నోటికి అందిస్తుంది. అలాగే భగవంతుడికి అర్పించిన ప్రసాదం ఆయన చూపుతోనే తీసుకుని, తిరిగి భక్తునికి ఇచ్చేస్తాడు. నిజంగా ఆయన తినడం మొదలు పెడితే విశ్వం చాలదు అనిపిస్తుంది. పాలల్లో కలిసిన పంచదార పైకి కనిపించనట్లే ఆయన కనిపించడు, కానీ #తియ్యదనాన్ని అందిస్తాడు. ఇక రుచి చూసి ఆనందించడం మన వంతు.
లోఖా సమస్త సుఖినో భవంతు
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో