యూకేకు చెందిన ‘యూగవ్’ కంపెనీ ఈ ఏడాదికి గానూ విడుదల చేసిన ప్రపంచంలో అత్యధికంగా ఆరాధించబడే వ్యక్తుల జాబితాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ టాప్-10లో నిలిచారు. ‘యూగవ్’ సంస్థ మొత్తం 35 దేశాలకు చెందిన 37,500 మంది నుంచి అభిప్రాయాలు తీసుకుంది. అత్యధికంగా ఆరాధించబడే వ్యక్తుల పురుషుల విభాగంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అగ్రస్థానంలో నిలవగా, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండు, సినీ నటుడు జాకీ చాన్ మూడు, చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్‌లు నాలుగో స్థానాల్లో ఉన్నారు.ఈ జాబితాలో నరేంద్ర మోదీ ఎనిమిదో స్థానంలో నిలవగా, అమితాబ్ బచ్చన్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఇక మహిళల విభాగంలో హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ అగ్రస్థానంలో నిలవగా, ఒబామా భార్య మిషెల్లీ మహిళల రెండో స్థానంలో నిలిచారు. ఇక బాలీవుడ్ నటీమణులు ఐశ్వర్య రాయ్ ఈ జాబితాలో 11వ స్థానంలో, ప్రియాంక చోప్రా 12వ స్థానంలో, దీపికా పదుకొణె 13వ స్థానంలో నిలిచారు.