YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జనాభాలో సగం మందికి పథకాలు

జనాభాలో సగం మందికి పథకాలు

విజయవాడ, జూలై 25, 
చంద్రబాబు ఎంతటి రాజకీయ గండర గండడో అందరికీ తెలిసిందే. బాబు ఎదుటివారు ఆవలించకుండానే పేగులు లెక్కబెడతారు. చంద్రబాబు ఎత్తులు జిత్తులు అన్నీ కూడా అవతల వారి కంటే ఆమడ దూరంలో ముందే ఉంటాయి. అందుకే ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన బాబు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. అటువంటి చంద్రబాబు రాజకీయ ప్రభ వెలిసిపోయేలా చేస్తున్నారు జగన్. పూర్తిగా వెలవెలబోయేలా కూడా చేస్తున్నారు. దాంతో బాబుకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. జగన్ ఇపుడు ఏ అవకాశం అసలు ఇవ్వడం లేదు కూడా.నిజానికి జగన్ గత ఎన్నికల వేళ పేజీలకు పేజీలు హామీలు ఇవ్వలేదు, కేవలం నవరత్నాలు అంటూ జనల్లోకి బ్రహ్మాస్త్రాన్ని వదిలారు. అది చంద్రబాబు పసుపు కోటలను తుత్తునియలు చేసింది. బాబు పార్టీనే ఊగిసలాడేలా చేసింది. ఈ పరిణామంతో బేజారెత్తడం తెలుగు వల్లభుడి వంతు అయింది. జగన్ కేవలం హామీలకే పరిమితం కావడం లేదు. వాటిని అమలు చేసి కూడా చూపిస్తున్నారు. అప్పులు చేసి మరీ ప్రతీ ఒక్క కుటుంబంలోనూ, ప్రతీ జేబులోనూ నగదు నింపుతున్నారు. వైసీపీ మంత్రుల మాటలను బట్టి చూసుకున్నా మొత్తం అయిదు కోట్ల మేర ఏపీ జనాభా ఉంటే అందులో మూడున్నర కోట్లకు పైగా జగన్ ఫలాలు, ఫలితాలు అందాయి. ఇందులో సగానికి పైగా ఓట్లేస్తే చాలు జగన్ మళ్ళీ ముఖ్యమంత్రే.ఇక ఇపుడు కొత్త జిల్లాలు అంటున్నారు జగన్. మూడు రాజధానులు కూడా అంటున్నారు. వీటితో పాటు ప్రతీ జిల్లా అభివ్రుధ్ధికి బ్లూ ప్రింటుని తయారు చేసి ఆయా జిల్లా స్వరూప స్వభావాలకు తగినట్లుగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచాలని కూడా జగన్ సర్కార్ భావిస్తోంది. ఇవన్నీ జగన్ రానున్న నాలుగేళ్లలో చేయబోయే పనులు. మరి 2024 నాటికి జగన్ తాను చేసినవి చెప్పుకుంటారు. ఓట్లు అడుగుతారు, కానీ చంద్రబాబు ఏం చెప్పాలి. ఏ విధంగా హామీలు ఇచ్చి జనం మెప్పు పొందాలి. ఇది నిజంగా బిగ్ టాస్క్, చంద్రబాబుకు తెలియకుండానే జగన్ ఉచ్చు బిగించేశారు. దాంట్లో ఇపుడు బాబు చిక్కుకున్నారు.చంద్రబాబుకు ఒక ముద్ర ఉంది. ఇచ్చిన హామీ తీర్చడని, అలాంటి వేళ చంద్రబాబు రేపటి రోజున ఏ హామీ ఇవ్వాలి. ఇచ్చినా జనాలు ఏ విధంగా నమ్మాలి. అసలు తన ఎన్నికల మ్యానిఫేస్టోలో ఏదైనా చెప్పడానికి జగన్ మిగిల్చి ఉంచారా అని ఇపుడు బాబు చూసుకుంటున్నారుట. దాదాపు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు తీసుకోలేని అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు జగన్ కేవలం తన తొలి ఏడాదిలోనే తీసుకున్నారు. బాబుకు బంగారం లాంటి అవకాశాలు వచ్చినా చేయలేనివి జగన్ చేసి చూపిస్తున్నారు. మరి చంద్రబాబు 2024 ఎన్నికలకు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి. ఏ హామీలతో జనం మెప్పు పొందాలి. ఇదే ఇపుడు టీడీపీ అధినేతను తొలిచేస్తోందిట. దీంతో చంద్రబాబుకు ఇప్పటి నుంచే నిద్ర కరవు అవుతోందిట.

Related Posts