*కోవిడ్-19కు సంబంధించిన ముఖ్య సమాచారం కోసం Covid-19 Andhra Pradesh మొబైల్ అప్లికేషన్*
రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు రోజురోజుకు మరింతగా పెరిగిపోతున్నాయి. కోవిడ్-19 టెస్టుల సంఖ్య పెంచే కొద్దీ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. *కోవిడ్ లక్షణాలు ఉంటే ఎవరిని సంప్రదించాలి?* ఎక్కడ టెస్టులు చేయించుకోవాలన్న సందేహాలు ఇప్పటికీ ప్రజల్లో ఉంటున్నాయి.
కోవిడ్-19 కి సంబంధించిన అన్ని సందేహాలను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ *కోవిడ్-19 ఆంధ్రప్రదేశ్* అనే *మొబైల్ అప్లికేషన్* రూపొందించింది.
కోవిడ్-19పై పోరాటంలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలకు సంబంధించిన సమాచారం ఈ మొబైల్ అప్లికేషన్లో ఉంటుంది.
రాష్ట్రంలోని కోవిడ్-19 ఆస్పత్రుల వివరాలు, క్వారంటైన్ కేంద్రాల సమాచారం, కోవిడ్ పరీక్షా కేంద్రాలతో పాటు ఏపీలోని కరోనా పాజిటివ్ కేసులు, డిశ్ఛార్జ్ అయిన వారు, మరణాల సంఖ్యతోపాటు ప్రతి రోజు ప్రభుత్వం విడుదల చేసే మీడియా బులిటెన్ సైతం ఈ యాప్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు.
అంతేకాకుండా మనలో ఉన్న లక్షణాలను బట్టి *కోవిడ్ పరీక్ష* కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అంతేకాకుండా మీ ప్రాంతంలో ఉండే *వార్డు వాలంటీర్, ఎఎన్ఎం, డాక్టర్ ను సంప్రదించడం* తదితర వివరాలను తెలుసుకోవచ్చు. స్మార్ట్ఫోన్ యూజర్లు https://bit.ly/30FvmBm లింక్ నుంచి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కోవిడ్-19కి సంబంధించిన ఎలాంటి సమాచారం కోసమైనా, ఇతర సహాయం కోసమైనా *జాతీయస్థాయి హెల్ప్ లైన్ 1075*, *రాష్ట్రస్థాయిలో 104*కి కాల్ చేయవచ్చు.
*వై.ఎస్.ఆర్. టెలీమెడిసిన్ నెంబర్ 14410*కు మిస్డ్ కాల్ ఇచ్చి ఫోన్ ద్వారా డాక్టర్ గారితో మాట్లాడి మీ ఆరోగ్య సమస్యలను తెలపవచ్చు. ఇంకనూ కోవిడ్-19 కు సంబంధించిన అధికారిక సమాచారం కోసం *8297104104 వాట్సప్ నెంబర్* కు మెసేజ్ చేయొచ్చు లేదా 8297104104 నెంబర్ కు డయల్ చేసి *ఐవిఆర్ఎస్(IVRS)* ద్వారా సహాయం పొందవచ్చు
*మన జాగ్రత్తలో మనం ఉండటం అతి ఉత్తమం!!*
*లేకుంటే కరోనా బారిన మనం పడటమే కాకుండా మన కుటుంబ సభ్యులకు కూడా వ్యాప్తి చేసిన వాళ్ళం అవుతాం!!*
*ఆసుపత్రి చుట్టూ తిరగటం అవుతుంది**
*డాక్టర్ అర్జా శ్రీకాంత్*
*కోవిడ్-19 స్టేట్ నోడల్ ఆఫీసర్*