YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మూడు జిల్లాల్లే హాట్ స్పాట్లు

మూడు జిల్లాల్లే హాట్ స్పాట్లు

విజయవాడ, జూలై 25, 
ఏపీలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ లోని ప్రైవేటు ఆసుపత్రులైన ఎన్ ఆర్ ఐ ఆసుపత్రి, కాటూరి మెడికల్ కళాశాల ఆసుపత్రి, లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, డి వి సి ఆసుపత్రులను జిల్లా కోవిడ్ -19 లైన్ ఆసుపత్రులుగా గుర్తించడం జరిగిందన్నా కోవిడ్19 జిల్లా ప్రత్యేక అధికారి  రాజశేఖర్.  చికిత్స అవసరమైన ప్రతి ఒక్క కరోనా వైరస్ వ్యక్తికి ఆరోగ్య శ్రీ పధకం ద్వారానే ఉచితంగా చికిత్స చేయడం జరుగుతుందన్నారు.
కోవిడ్ -19 లైన్ ఆసుపత్రులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రిఫర్ చేసిన వారిని మాత్రమే చేర్చుకోవాలని, నేరుగా పాజిటివ్ వ్యక్తులను చేర్చుకోవడానికి వీలు లేదన్నారు. చికిత్స కోసం ఆసుపత్రులలో చేరిన వ్యక్తులందరికీ జిల్లా ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ ద్వారా సి యం క్యాంపు ఆఫీస్ కార్డును జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.  చికిత్స కోసం పాజిటివ్ వ్యక్తుల నుండి ఎటువంటి అదనపు ఫీజులు వసూలు చేయరాదు నాన్ ఆరోగ్య శ్రీ ఆసుపత్రులు సైతం కోవిడ్ పేషెంట్లకు చికిత్స చేసేందుకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.  కోవిడ్ -19 లైన్ ఆసుపత్రుల మినహా జిల్లాలో అనుమతి తీసుకోకుండా పాజిటివ్ వ్యక్తులకు ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స చేయకూడదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తులలో 80 శాతం వరకు చికిత్స అవసరం లేదు, హోమ్ ఐసోలేషన్ లో వున్నవారు అనివార్య పరిస్థితులలో అస్వస్థతకు గురి అయితే 0863 - 2271492 కోవిడ్-19 కంట్రోల్ రూముకు ఫోన్ చేసి తక్షణ సహాయం పొందవచ్చని తెలిపారు.
ఇటు ఎప్పుడూ లేని విధంగా ఏపీలో ఏకంగా 7998 కేసులు నమోదయ్యాయి. ఏపీలోని క‌ర్నూలు, గుంటూరు, తూర్పు గోదావ‌రి ఈ మూడు జిల్లాల్లో కోవిడ్ పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70 వేలు దాటింది. ప్ర‌స్తుతం ఏపీలో క‌రోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 72,711 ఉండ‌గా, ఇక ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్ర వ్యాప్తంగా 884 మంది మ‌ర‌ణించారు.ఇక ఏపీలో అత్య‌ధిక క‌రోనా కేసుల‌తో తూర్పు గోదావరి జిల్లా టాప్‌లో ఉంది. ఈస్ట్ గోదావ‌రిలో క‌రోనా కేసుల సంఖ్య ఏకంగా 10 వేలు దాటింది.ప్ర‌స్తుతం అక్క‌డ 10,038 క‌రోనా కేసులు ఉండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కూ 96 మంది కోవిడ్ బారిన ప‌డి మ‌ర‌ణించారు. ఇక తూర్పు గోదావ‌రిలో 6786 యాక్టీవ్ కేసులు ఉండ‌గా, 3156 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గుంటూరులో 8097 కోవిడ్ కేసులు రిజిస్ట‌ర్ అవ్వ‌గా, ఇప్ప‌టివ‌ర‌కూ అక్క‌డ 85 మంది చ‌నిపోయారు. అలాగే క‌ర్నూలులో 8701 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వ్వ‌గా, ఏపీలోనే అత్య‌ధికంగా 142 మంది కోవిడ్‌తో ఈ జిల్లాలో మ‌ర‌ణించారు. దీంతో అధికారులు ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ంటున్నారు.

Related Posts