YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆగస్ట్ నెల టోకెన్లు విడుదల

ఆగస్ట్ నెల టోకెన్లు విడుదల

తిరుమల, జూలై 25, 
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. వెంక‌న్న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఆగస్టు నెలకు సంబంధించి రోజుకు 9 వేల టికెట్లను.. శ్రీవారి భక్తులు పొందేందుకు సౌల‌భ్యం కల్పించింది. క‌రోనా వ్యాప్తితో లాక్ డౌన్ అమలులో ఉండ‌టంతో సర్వదర్శనం టోకెన్లు జారీని తాత్కాలికంగా ఆపివేసింది. సర్వదర్శన టోకెన్లు జారీ నిలిపివేతతో టికెట్స్ సంఖ్య 12 వేల నుంచి 9 వేలకు తగ్గింది. టికెట్లను జారీ చేయడం శుభవార్త అయితే.. సర్వదర్శనం టోకెన్లు నిలిపివేయడం ఓ విధంగా బ్యాడ్‌న్యూస్. అంతేకాదు కరోనా భయంతో చాలామంది భక్తులు దర్శనానికి టోకెన్లు తీసుకున్నా రావడం లేదట.
తిరుపతిలో కరోనా కేసులు పెరుగుతండటం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో ఇప్పటి వరకు ఏకంగా 1500కుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. తిరుపతి మొత్తం కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయని.. అత్య‌వ‌స‌ర సేవ‌లు, మెడిక‌ల్ షాపులు మిన‌హా మిగ‌తా దుకాణాల‌కు ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది. ఆంక్ష‌ల స‌మ‌యంలో ప్రైవేటు వాహ‌నాల‌కు న‌గ‌రంలోనికి అనుమ‌తి ఉండ‌దు.ఒకవేళ ప్రైవేటు వాహ‌నాల్లో తిరుమ‌ల‌కు వెళ్లేవారు బైపాస్ రోడ్ మార్గం ద్వారా వెళ్లాల‌ని ఎస్పీ రమేష్ రెడ్డి సూచించారు. ఇక బైకులు సైతం ఒక్క‌రికే అనుమ‌తి ఉంటుందన్నారు. నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే జ‌రిమానాలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఈ ఆంక్ష‌లు వ‌చ్చే నెల 5 వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ నిబంధ‌న‌లు పాటించాల‌ని కోరారు. ఈనెల 31న సమావేశమై పాజిటివ్‌ కేసుల సంఖ్యను బట్టి లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను కుదించాలా, మరో 14 రోజులు పొడిగించాలా అన్న నిర్ణయం తీసుకుంటారు.

Related Posts