YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

ప్రాణాంతకమవుతున్న కొందరి నిర్లక్ష్యం

ప్రాణాంతకమవుతున్న కొందరి నిర్లక్ష్యం

నిజామాబాద్, జూలై 25, 
ఇది కొవిడ్‌-19 కాలం. కంటికి కనిపించని మహమ్మారితో యుద్ధం చేస్తున్న విపత్కర సమయం. అప్రమత్తతే మనకు రక్ష. అదే మనల్ని, మన కుటుంబాల్ని, మన సమాజాన్ని సేఫ్‌గా ఉంచుతుంది. ఇది మనం ఒక్కరమే కాదు ప్రతి వ్యక్తి అనుకుంటేనే సాధ్యమవుతుంది. కానీ, ఇటీవలి కాలంలో కొందరి నిర్లక్ష్యం.. ప్రాణాంతకమవుతున్నది. కేసుల సంఖ్య విపరీతంగా పెరగడానికి కారణమవుతున్నది. ఇటీవలి కాలంలో ఎక్కువగా నమోదవుతున్న కేసులను గమనిస్తే నిర్లక్ష్యమే కనిపిస్తున్నది. మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం, అవసరం లేకున్నా రోడ్లపైకి రావడం, లక్షణాలు ఉన్నా ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల వైరస్‌ విజృంభిస్తున్నది. ఈ అలసత్వమే ప్రాణాలమీదికి తీసుకురావడంతోపాటు కేసుల ఉధృతికి కారణమవుతున్నది. ఇది ఎంతమాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు పాటించడంతోపాటు చిన్నపాటి లక్షణాలున్నా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారుఇటీవల హుజూరాబాద్‌లో ఓ వ్యక్తి తనకు పాజిటివ్‌ అని తెలిసినా నిర్లక్ష్యం చేశాడు. దవాఖానలో చేరకుండానే మృత్యువాత పడ్డాడు. సదరు వ్యక్తి పాజిటివ్‌ వచ్చిన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం వల్ల భార్య, కొడుకు, మనువడితోపాటు ఇంటి వద్ద వైద్యం చేసిన ఆర్‌ఎంపీకి కూడా పాజిటివ్‌ వచ్చింది. అలాగే ఓ బ్యాంక్‌ ఉద్యోగి నిర్లక్ష్యం వల్ల భార్య, కొడుకు, కోడలు, పక్కింటి వ్యక్తితోపాటు అదే వీధిలో ఓ నలుగురికీ అంటింది. ఇలానే చాలా మంది అనుమానితులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. వైద్యశాలకు వెళ్లకపోగా సొంత వైద్యం చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఎవరికీ చెప్పకుండా మెడికల్‌ షాపులకు వెళ్లి మందులు తెచ్చుకొని వేసుకోవడం, లేదా ఆర్‌ఎంపీల సలహాలతో చికిత్స తీసుకుంటూ అటు వైరస్‌ ఉధృతిని పెంచుతూనే తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. కుటుంబ సభ్యులతోపాటు తెలిసినవారిని బాధితులుగా మార్చుతున్నారు. రోజుల తరబడి అస్వస్థతతో బాధపడుతున్నా.. అనుమానిత లక్షణాలున్నా కొందరు వైద్య పరీక్షలు చేయించుకోవడం లేదు. కొంతమందైతే టెస్టులు చేయించుకొని మరీ చికిత్సకు ముందుకు రావడం లేదు. ఇంకొంత మంది ఆర్‌ఎంపీలను ఆశ్రయించి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. వైరస్‌ ఉధృతికి కారణమవుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన కేసుల్లో కొన్ని ఇలాంటి నిర్లక్ష్యం వల్ల జరిగినవే. నిబంధనలు ఉల్లంఘించిన సదరు ఆర్‌ఎంపీల విషయమై ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. వైరస్‌ లక్షణాలున్నవారు సత్వరం స్పందించి పరీక్షలు చేయించుకుంటే ప్రమాదం నుంచి బయటపడొచ్చు.

Related Posts