YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

కరోనా పేషెంట్లకు వైద్యం అందటం లేదు - ఎమ్మెల్యే గద్దె రామమోహన్, మాజీ జడ్పీటీసీ చైర్మన్ గద్దె అనురాధ

కరోనా పేషెంట్లకు వైద్యం అందటం లేదు - ఎమ్మెల్యే  గద్దె రామమోహన్, మాజీ  జడ్పీటీసీ చైర్మన్ గద్దె అనురాధ

విజయవాడ జులై 25 
 కరోనా బాధితుల సమస్యల పరిష్కారంలో భాగంగా శుక్రవారం నాడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నిర్వహించిన వర్డ్యువల్ యాజిటేషన్ కార్యక్రమంలో శాసనసభ్యుడు గద్దె రామమోహన్, జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ గద్దె అనురాధలు తమ ఇంటి వద్ద నుంచి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  రాష్ట్రంలో కరోనా పేషెంట్లకు సరైన వైద్యం అందటం లేదని హాస్పటల్స్ లో వసతులు లేవని, మందులు కూడా అందటం లేదన్నారు.   ముఖ్యంగా స్వాబ్ టెస్టుల కోసం ప్రజలు అర్ధరాత్రి నుంచే క్యూలలో నుంచుంటున్నారని , కరోనా నిర్ధారణ పరీక్షలు వారం రోజులు వరకు రావటం లేదని, అటువంటప్పుడు పరీక్షలు చేసి ఉపయోగం ఏమిటి అని వారు ప్రశ్నించారు.   కరోనా నియంత్రణకు రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్ళి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తామని, ఒక్కొక్కరికి మూడు మాస్కులు ఇస్తామని చేసిన వాగ్దానం ఏమైందని వారు ప్రశ్నించారు.   హాస్పటల్స్ లో ఆక్సిజన్ దొరకక పేషెంట్లు చనిపోతున్నారని, రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చేయి దాటిపోయిందని వారన్నారు.

Related Posts