సిద్దిపేట జులై 25
జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో హరే రామ హరేకృష్ణ మూవ్ మెంట్, మెగా కంపనీ సహకారంతో ఉచిత కషాయ వితరణ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ - కషాయం తాగండి. కరోనాను జయించండి. ప్రభుత్వానికి సహకరించి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని అన్నారు. - కరోనా నియంత్రణకై పట్టణంలోని ప్రతీ హోటల్, రెస్టారెంట్లలో వేడినీళ్లు అందివ్వాలని అన్నారు. - సిద్ధిపేట పట్టణంలో ఉచిత కషాయ కేంద్రాన్ని ప్రారంభం చేసుకున్నాం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. కరోనా వచ్చి హోమ్ ఐసోలేషన్ ఉన్న వారికి 12 రకాల వస్తువులతో కూడిన కరోనా కిట్ అందిస్తున్నాం. - వేసవి కాలంలోచలి వేంద్రాన్ని ప్రారంభం చేసుకున్నట్లు, ఇవాళ వేడినీరు, కషాయ వితారణ కేంద్రాన్ని ప్రారంభం చేసుకున్నాం. కరోనా కష్ట కాలంలో ప్రజలు బయటకు రాకూడదు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరు బయటకు రావొద్దు. స్వీయ నియంత్రణ పాటించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు. - యోగా, వ్యాయామం చేసే వారు ఆరోగ్యంగా ఉంటున్నారు. సిద్దిపేటకు వివిధ పనుల కోసం వచ్చే వారి కోసం పట్టణంలో మూడు చోట్ల వేడి నీటి కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. కరోనా నుంచి బయట పడాలంటే వేడి నీరు, కషాయం తాగితే.. సులువుగా బయట పడవచ్చు. కరోనా వచ్చి హోమ్ ఐసోలేషన్ ఉన్న వారికి 12 రకాల వస్తువులతో కూడిన కరోనా కిట్ అందిస్తున్నాం. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షలాది రూపాయల ఖర్చు చేయొద్దు. ప్రభుత్వం ఇచ్చే సూచనలు తప్పకుండా పాటించాలి. సిద్దిపేటలో 100 పడకల కొవిడ్, గజ్వేల్ ఆర్వీఏం ఆసుపత్రిలో వంద పడకలు, సంగారెడ్డి ఏంఎన్ ఆసుపత్రిలో 100 పడకలతో కరోనా ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రులు ఉన్నాయి. - కరోనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేసుకోవాలని మంత్రి సూచించారు.