శ్రీకాళహస్తి జులై 25
శ్రీకాళహస్తి లో సంజీవిని బస్సు ద్వారా పెద్ద ఎత్తున కరోనా పరీక్షలకు స్వాబ్ నమూనాలను సేకరించారు. కరోనా అనుమానితులు వయసు పైబడిన వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ కోరారు.
శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో విస్తృత స్థాయిలో కరోనా పరీక్షలు చేపట్టారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి స్థానిక బైపాస్ రోడ్డులో సంజీవని బస్సు ను ఏర్పాటు చేసి స్వాబ్ పద్ధతిలో కరోనా పరీక్షలు కోసం శాంపిల్స్ సేకరించారు. బి పి అగ్రహారం, ఏ యం పుత్తూరు, వి యం పల్లి తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది నుండి శాంపిల్స్ ను సేకరించారు. ఈ ప్రాంతాల్లో వైరస్ ప్రభావం అధికంగా ఉండడంతో ఈ ప్రాంతంలోని వృద్ధులకు మరియు అనుమానితుల కు పరీక్షలు చేశారు.
మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ వైరస్ ప్రభావం అధికంగా ఉన్న దృష్ట్యా సంజీవిని బస్సు ను శ్రీకాళహస్తి కేటాయించారని, వయో వృద్ధులు, అనుమానితులు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.