నందికొట్కూరు జులై 25
వరి నాట్లకు ముందే సాగు నీరు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి 2 వేల క్యూసెక్కుల నీటి విడుదల
అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని శాసనసభ్యుడు తొగురు ఆర్థర్ అన్నారు. శనివారం ఎగువ నుంచి కృష్ణా నదికి నీరు వరద నీరు వచ్చి చేరడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఎమ్మెల్యే కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో రైతాంగానికి వరి నాట్లకు ముందే సాగు నీటిని అందించిన ఘనత ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర రెడ్డి, పోతిరెడ్డిపాడు కాల్వను 11,500 క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచితే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ 44 వేల నుంచి 80వేల క్యూసెక్కుల నీటి ప్రవాహనికి చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. శ్రీశైల జలాశయానికి వచ్చే వరద నీటిని సద్వినియెగించుకొని వెలుగోడు, గోరుకల్లు, అవుకు జలాశయాలను నింపుకొని రైతులకు సకాలంలో సాగునీరు అందించే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. రైతులు సాగునీటిని సద్వినియెగించుకొని పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వ హయాంలో కర్షక రైతులు సాగు చేసిన పంటలు అధిక దిగుబడులు సాధించాలని అకాంక్షించారు. రైతులు పండించిన మొక్కజొన్న, వరి, పసుపు, జొన్న, మినుములు, శనగలు ధాన్యానికి మద్దతు ధర కల్పించి అన్నదాతలకు తమ ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ అధికారులు,వైస్సార్సీపీ నాయకులు మండలెం ప్రతాప్ రెడ్డి,శివానంద రెడ్డి,పారుమంచాల దేవా,ముడియాల శ్రీనివాస్ రెడ్డి, రామలింగేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.