తాడిపత్రి జులై 25 తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్తత -కాంచని హాస్పిటల్ ఎదురుగా ప్రముఖ వైకాపా నాయకులు రమేష్ ధర్నా.. - రక్ష పరీక్షా కేంద్రాలు, ఆర్ఎంపీ లను వేధించడం పైనా తీవ్ర ఆగ్రహం
కేవలం లాభాపేక్ష తో వైద్య రంగాన్ని వ్యాపార రంగంగా కాంచని హాస్పిటల్ ఎండీ చంద్రమౌళీశ్వర రెడ్డి మార్చివేశారని ఆరోపిస్తూ ప్రముఖ వైకాపా నాయకులు రమేష్ రెడ్డి హాస్పిటల్ ఎదుట ధర్నా కు దిగారు. డాక్టర్ చంద్రమౌళి వల్ల నిస్వార్థంగా సేవ చేసే డాక్టర్లకు కూడా చెడ్డ పేరువస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వర్షా కాలంలో వివిధ సీజనల్ వ్యాధులు ప్రబలడం సహజమన్నారు. ఆస్పత్రికి జలుబు, జ్వరం వ్యాధులతో వస్తే కనీస పరీక్షలు నిర్వహించరాదని ప్రభుత్వం పై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని రమేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కనీసం ఆర్ఎంపీ డాక్టర్లు వైద్యం అందిస్తుంటే వారిపై ఫిర్యాదులు, బెదిరింపులకు కాంచని ఎండీ పాల్పడుతున్నాడని ఆయన ఆరోపించారు. రక్త పరీక్షా కేంద్రాల్లో గల్ల , మూత్ర పరీక్షలు తమ అనుమతి లేకుండా చేస్తే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం ఏం మాత్రం సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి నుండి డాక్టరేట్ వెనకకు తీసుకుని కఠిన శిక్ష పడేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నా లో పెద్ద ఎత్తున వైకాపా అభిమానులు పాల్గొనడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని వైకాపా నాయకులను అక్కడి నుంచి పంపివేశారు.